ఇంట్లో లేని ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలపై కేసులు పెట్టిన పోలీసులు

  • Publish Date - March 27, 2020 / 04:06 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో ఇద్దరు ఎన్ఆర్ఐలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మైలవరంలో హోమ్ క్వారెంటైన్‌ పాటించని ఇద్దరు ఎన్నారైలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

మార్చి 14వ తేదీన అమెరికా నుంచి వచ్చిన కొనసాని సాగర్, లక్కిరెడ్డి విశ్వనాథ రెడ్డిలను పోలీసులు హోమ్ క్వారంటైన్‌కు ఆదేశించారు. అయితే గ్రామ సంరక్షణ కార్యదర్శి తనిఖీ చేసిన సమయంలో సదరు ఎన్నారైలిద్దరూ ఇంట్లో లేరు.

దీంతో హోమ్ క్వారంటైన్‌లో లేని కారణంగా  ఇద్దరు ఎన్నారైలపై మైలవరం పీఎస్‌లో క్వారెంటైన్ యాక్ట్ ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదు చేశారు. 

Also Read |  కరోనా : ఢిల్లీలో 35 భవనాల్లో హోం షెల్టర్స్..ఆహారం కూడా