AP Covid 19 : 24 గంటల్లో 349 కేసులు, 472 మంది డిశ్చార్జ్

Andhra Pradesh Covid 19 Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 349 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 30వ తేదీ బుధవారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. 55 వేల 740 శాంపిల్స్ పరీక్షించినట్లు, గడిచిన 24 గంటల్లో 472 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని, బుధవారం వరకు రాష్ట్రంలో 1,17,64,418 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని వెల్లడించింది. మొత్తంగా ఏపీ రాష్ట్రంలో 8 లక్షల 81 వేల 948కి కరోనా కేసులు చేరుకున్నాయి. ప్రస్తుతం ఏపీలో 3 వేల 256 యాక్టివ్ కేసులు ఉండగా..8 లక్షల 71 వేల 588 మంది డిశ్చార్జ్ అయ్యారు.

జిల్లాల వారీగా :

అనంతపురం : 16. చిత్తూరు 50. ఈస్ట్ గోదావరి : 28. గుంటూరు : 44. కడప : 24. కృష్ణా : 75. కర్నూలు : 07. నెల్లూరు : 09. ప్రకాశం : 06. శ్రీకాకుళం : 14. విశాఖపట్టణం : 26. విజయనగరం : 04. వెస్ట్ గోదావరి : 46. మొత్తం 349.


రాష్ట్రాల వారీగా శాంపిల్స్ :

ఆంధ్రప్రదేశ్ : 1,17,64,418. కేరళ : 77,89,764. కర్నాటక : 1,38,58,850. తమిళనాడు : 1,40,52,537. తెలంగాణ : 67,93,691. గుజరాత్ : 95,43,400, మహారాష్ట్ర : 1,26,00,754. రాజస్థాన్ : 52,13,762. మధ్యప్రదేశ్ : 45,56,846. ఇండియా : 17,09,22,330.