AP Dugarajapatnam Shipyard: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. దుగరాజపట్నంలో రూ. 15,000 కోట్లతో షిప్ యార్డ్.. 45 వేల మందికి ఉద్యోగాలు!
దుగరాజపట్నం(AP Dugarajapatnam Shipyard)లో రూ. 15,000 కోట్ల భారీ పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
- V Santhosh Kumar
- Published on- September 18, 2026 / 09:50 PM IST
andhra pradesh dugarajapatnam greenfield shipyard mou mazagon dock
AP Dugarajapatnam Shipyard: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేస్తూ చంద్రబాబు సర్కార్ మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. దుగరాజపట్నం(AP Dugarajapatnam Shipyard)లో రూ. 15,000 కోట్ల భారీ పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటు చేసేందుకు మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL)తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఈ కీలక ఒప్పందం ద్వారా రాబోయే ఐదేళ్లలో ఏపీ మారిటైమ్ రంగానికి నూతన ఉత్తేజం లభించడమే కాకుండా, ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 45,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
TGPSC: తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. జలమండలిలో 130 పోస్టలు.. టీజీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదల
ఎస్‌ఐపీబీ సంచలన నిర్ణయాలు.. రూ. 22,177 కోట్ల ప్రాజెక్టులకు లభింఛిన ఆమోదం:
మరోవైపు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన 21వ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశంలో మొత్తం 28 ప్రాజెక్టులకు సంబంధించిన రూ. 22,177.84 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డ్ ద్వారా రూ. 8,000 కోట్లు, పల్నాడులో మై హోమ్ ఇండస్ట్రీస్ ద్వారా రూ. 3,000 కోట్ల పెట్టుబడులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ నూతన పారిశ్రామిక ఆమోదాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అదనంగా మరో 19,739 ఉద్యోగాలు రానున్నాయి.
అమరావతిలో హైటెక్ హబ్‌లు.. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ రంగాలు అనుసంధానం:
అమరావతి, కొప్పర్తి, తిరుపతి ప్రాంతాల్లో క్వాంటమ్ ఏఐ, సెమీకండక్టర్లు, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ తయారీ హబ్‌లను నెలకొల్పాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని పోర్టులను లాజిస్టిక్స్, గోదాములు, తయారీ రంగాలతో సమగ్రంగా అనుసంధానించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటివరకు నిర్వహించిన SIPB సమావేశాల ద్వారా మొత్తం రూ. 14.05 లక్షల కోట్ల పెట్టుబడులు, 10.79 లక్షల ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమమైందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
