AP Government : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హాస్టల్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..

AP Government : హాస్టల్ విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో వారికి కొత్త మెనూ రెడీ చేసింది.

Andhra Pradesh government increases diet charges hostel students

AP Government : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు మేలు జరిగేలా.. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేలా కొత్తకొత్త పథకాలను అమల్లోకి తీసుకొస్తోంది. అయితే, తాజాగా.. హాస్టల్ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Also Read : Rain Alert : బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు. భీకర గాలులు..

హాస్టల్ విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో వారికి కొత్త మెనూ రెడీ చేసింది. ఇకపై వారికి రోజూ పలు, పండ్లు, పోషకాహారం అందించనుంది. ఇందులో భాగంగా విద్యార్థుల డైట్ ఛార్జీలను ప్రభుత్వం పెంపు చేసింది.

రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు, కేజీబీవీలు, హాస్టళ్లు, మోడల్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు పెంచిన డైట్ ఛార్జీలు వర్తిస్తాయి. మూడు నుంచి 6వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ. 1,150 నుంచి రూ.1265కు పెంచింది. 7వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ. 1400 నుంచి రూ. 1540కు పెంపు చేసింది. అదేవిధంగా ఇంటర్ ఆపై తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ.1600 నుంచి రూ. 1760కు పెంపు చేసింది. పెంచిన కొత్త డైట్ ఛార్జీలు అక్టోబర్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయని అధికారులు తెలిపారు.

హాస్టల్ విద్యార్థులకు ఇకపై వారంలో ఆరు రోజులు గుడ్లు అందించనున్నారు. వారంలో మూడు రోజులు చికెన్, ప్రతీరోజూ పాలు, పండ్లు అందించనున్నారు. కొత్త మెనూలో చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ, పులిహోర, ఇండ్లీ, ఉప్మా, పొంగల్, రాగి లడ్డూ, మల్టీ మిల్లెట్ చిక్కీలు, పండ్లు ఉన్నాయి.