AP Govt : ఏపీలోని పేద వర్గాల ప్రజలకు శుభవార్త.. సర్కార్ కీలక నిర్ణయం.. తక్కువ ధరకే బియ్యం..

Andhra Pradesh : బియ్యం ధరలు పెరగడంతో పేదలు, మధ్యతరగతి వర్గాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులపై ఆర్థిక భారం తగ్గించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Andhra Pradesh

Andhra Pradesh : తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. ఎల్ నినో ప్రభావంతో ఈ సంవత్సరం వరిసాగు విస్తీర్ణం తగ్గింది.. దీంతో ధాన్యం దిగుబడులు గణనీయంగా తగ్గాయి. దీంతో బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. పలు బ్రాండ్లకు సంబంధించి 26 కేజీల బియ్యం బ్యాగ్ ధర రూ. 1700 నుంచి రూ. 1800 వరకు విక్రయాలు చేస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు బియ్యం కొనుగోళ్లు ఆర్థికంగా భారంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆయా వర్గాల ప్రజలకు భారీ ఊరట లభించినట్లయింది.

Also Read : Central Government : రైతులకు, చిరు వ్యాపారులకు భారీ శుభవార్త.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇక ఆ ఇబ్బందులుండవ్..

బియ్యం ధరలు పెరగడంతో పేదలు, మధ్యతరగతి వర్గాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులపై ఆర్థిక భారం తగ్గించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బియ్యం ధరల భారం తగ్గించేందుకు ధరణి పేరుతో తక్కువ ధరకే బియ్యాన్ని అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు బియ్యం అందిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బియ్యం విక్రయించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం లభిస్తుండటంతో ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఆధార్ కార్డు తదితర ఆధారాలతో ధరణి బియ్యం అవసరమయ్యే లబ్ధిదారులను గుర్తించారు. ప్రతి రేషన్ కార్డుదారుడికి పారదర్శకంగా అందిస్తున్నారు. ఇందులో ఆర్‌ఎన్‌ఆర్, కేఎన్‌ఎం రకాలను కిలో రూ. 50 చొప్పున 26 కిలోల బస్తాను రూ. 1,300కు, బీపీటీ రకం కిలో రూ. 49 చొప్పున 26 కిలోల బస్తాను రూ. 1,274కు విక్రయిస్తున్నారు. ధరణి బియ్యం బస్తా తీసుకునేవారి పేరు, ఆధార్, మొబైల్ నంబర్లను నమోదు చేస్తారు. రేషన్ కార్డు ఉన్న వారందరికీ ధరణి బియ్యం అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

ధరణి పేరుతో ప్రభుత్వం విక్రయిస్తున్న బియ్యానికి డిమాండ్ పెరిగింది. భారీ సంఖ్యలో లబ్ధిదారులు బియ్యాన్ని కొనుగోళ్లు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో దాదాపు 5వేల మంది ప్రజలు 1170 క్వింటాళ్ల బియ్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు బియ్యం హోల్‌సేల్‌ షాపుల దగ్గర ధరల పట్టికను ప్రదర్శించాలని అధికారులు ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు.. రాష్ట్రంలో పేదలకు నిత్యావసరాల్ని రాయితీపై పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కార్ నిర్ణయించింది. రేషన్‌ దుకాణాల ద్వారా కిలో కందిపప్పు రూ.100, గోధుమపిండి రూ.25, లీటరు పామోలిన్‌ ఆయిల్‌ రూ.125 లెక్కన కార్డుదారులకు త్వరలో అందించనుంది.