IAS Transfers: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం, శాంతిభద్రతల పరిరక్షణను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఐపీఎస్ అధికారుల బదిలీల(IAS Transfers)ను చేపట్టింది.
- V Santhosh Kumar
- Published on- July 6, 2026 / 04:45 PM IST
Andhra Pradesh government transfers 4 IAS officers
- ఏపీ ఐపీఎస్ అధికారుల బదిలీలు.
- ఆరుగురు అధికారులకు కొత్త పోస్టింగ్‌లు.
- తక్షణమే అమలులోకి ఉత్తర్వులు.
IAS Transfers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం, శాంతిభద్రతల పరిరక్షణను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఐపీఎస్ అధికారుల బదిలీల(IAS Transfers)ను చేపట్టింది. ఈ మేరకు నలుగురు కీలక అధికారులకు తక్షణమే బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు కల్పిస్తూ ఏపీ సర్కార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారులు వెంటనే తమ కొత్త బాధ్యతలను స్వీకరించాలని, ఇందుకు సంబంధించిన తదుపరి చర్యలను వేగవంతం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)ని ప్రభుత్వం ఆదేశించింది.
Revanth Reddy: అంతర్జాతీయస్థాయిలో ఫ్యూచర్ సిటీ.. సీఎం కీలక ఆదేశాలు.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ఈ తాజా బదిలీలలో భాగంగా నలుగురు ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కలిగింది. చింతపల్లి ఏఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నవజ్యోతి మిశ్రాను మార్కాపురం జిల్లా ఓఎస్డీ (అడ్మిన్)గా బదిలీ చేశారు. అలాగే కాకినాడ ఏఎస్పీగా సేవలందిస్తున్న పాటిల్ దేవ్రాజ్ మనీష్‌ను తూర్పు గోదావరి జిల్లా (రాజమహేంద్రవరం) అదనపు ఎస్పీ (అడ్మిన్)గా నియమించారు. నంద్యాల ఏఎస్పీగా ఉన్న మండా జవాలి అల్ఫోన్స్‌ను పోలవరం జిల్లా ఓఎస్డీ (అడ్మిన్)గా బదిలీ చేయగా, రాజంపేట్ ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న మనోజ్ రామనాథ్ హెగ్డేను అమరావతి ఓఎస్డీ (లా అండ్ ఆర్డర్)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
మరో ఇద్దరు అధికారుల బదిలీలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడిపత్రి ఏఎస్పీగా బాధ్యతల్లో ఉన్న రోహిత్ కుమార్ చౌదరిని పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేశారు. అలాగే జంగారెడ్డిగూడెం ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సుస్మితను నంద్యాల ఏఎస్పీగా బదిలీ చేస్తూ కొత్త పోస్టింగ్ ఇచ్చారు. పోలీస్ శాఖలో మరింత పారదర్శకత, సమర్థవంతమైన పరిపాలనను తీసుకురావడంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బదిలీలు తక్షణమే అమలులోకి రానున్నాయి.
