Revanth Reddy: అంతర్జాతీయస్థాయిలో ఫ్యూచర్ సిటీ.. సీఎం కీలక ఆదేశాలు.. ప్రత్యేక కమిటీ ఏర్పాటు
తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సరికొత్త యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు.
Cm Revanth Reddy government appoints a special committee on Telangana Future City
- సీఎం రేవంత్ పర్యాటక ప్రణాళిక.
- చారిత్రక, ప్రకృతి ప్రాంతాల అభివృద్ధి.
- వికారాబాద్ టూరిజం హబ్.
Revanth Reddy: తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సరికొత్త యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో పర్యాటక శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో చారిత్రక వైభవానికి అద్దం పట్టే తారామతి బారాదరితో పాటు, ప్రకృతి అందాల దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. అలాగే నగరంలోని మంజీరా, దిల్కుషా గెస్ట్ హౌస్‌లకు అధునాతన హంగులు అద్దాలని అధికారులను ఆదేశించారు.
Mobile Tariff Hike: మొబైల్ యూజర్లకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ప్లాన్స్ ధరలు
ఈ ప్రణాళికల్లో భాగంగా వికారాబాద్ ప్రాంతాన్ని ‘టూరిజం హబ్ డెవలప్మెంట్’ పథకం కింద ప్రత్యేకంగా అభివృద్ధి చేయనున్నారు. అక్కడి ప్రసిద్ధ వీరభద్ర స్వామి ఆలయ పునరుద్ధరణతో పాటు, యాదగిరిగుట్ట తరహాలోనే ఒక ప్రత్యేక స్వయంప్రతిపత్తి కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అటవీ భూములను ఎకో టూరిజం జోన్లుగా మార్చాలని, గుర్రంగూడ పార్కు తరహాలోనే నగరవ్యాప్తంగా మరిన్ని అర్బన్ పార్కులను నిర్మించాలని స్పష్టం చేశారు. వీటి పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించనున్నారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్యూచర్ సిటీలోని అటవీ భూములను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. చారిత్రక పురానాపూల్, హెరిటేజ్ బ్రిడ్జిలను పర్యాటక ఆకర్షణలుగా మార్చేందుకు అక్కడ ట్రాఫిక్‌ను మళ్లించి, కేవలం సందర్శకుల కోసమే ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. వీటన్నింటితో పాటు, రాబోయే డిసెంబర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్’ కోసం ఇప్పుడే ఏర్పాట్లు ప్రారంభించాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు.
