Raviteja Son : ఇప్పుడు సూర్య సినిమాకు, నెక్స్ట్ ప్రభాస్ సినిమాకు.. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రవితేజ కొడుకు..
తాజాగా దర్శకుడు వెంకీ అట్లూరి రవితేజ కొడుకు మహాధన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు. (Raviteja Son)
Raviteja Son
Raviteja Son : సినిమా సెలబ్రిటీల పిల్లలు కూడా సినీ పరిశ్రమలోకి వస్తారు చాలామంది. అదే కోవలో రవితేజ కొడుకు మహాధన్ కూడా సినీ పరిశ్రమలోకే వచ్చాడు. రవితేజ కొడుకు మహాధన్ ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా రాజా ది గ్రేట్ సినిమాలో నటించాడు. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. అప్పుడప్పుడు ఒకటి రెండు ఫొటోలు వేరే వాళ్ళు షేర్ చేస్తే తప్ప మహాధన్ ఫొటోలు కూడా బయటకు రాలేదు.
తాజాగా దర్శకుడు వెంకీ అట్లూరి రవితేజ కొడుకు మహాధన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఇటీవల వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సూర్య విశ్వనాధ్ & సన్స్ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. రవన్నతో నేను సినిమా చేయకపోయినా నాకు క్లోజ్. రవన్న కొడుకు మహాధన్ ఈ విశ్వనాధ్ & సన్స్ సినిమాకు నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. అతను చిన్నప్పట్నుంచి సినిమా వాతావరణంలోనే పెరిగాడు కాబట్టి అతని పని అతను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. రవన్న కూతురు కూడా పరిచయమే అని తెలిపాడు. కెరీర్ ఆరంభంలో రవితేజ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే.
Also Read : NTR : ఎన్టీఆర్ కి అప్పటివరకు రాజకీయాల్లోకి రావొద్దని చెప్పాను.. వేణుస్వామి కామెంట్స్ వైరల్..
అయితే మహాధన్ ఇప్పుడు సూర్య సినిమా అయ్యాక సందీప్ రెడ్డి వంగ – ప్రభాస్ స్పిరిట్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. దీంతో హీరో అవుతాడు అనుకుంటే మహాధన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు ఏంటి అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక రవితేజ కూతురు మోక్షద కూడా సినీ పరిశ్రమలోనే పనిచేస్తుంది. మోక్షద ఓ పక్క రవితేజ థియేటర్ ART సినిమాస్ బాధ్యతలు చూసుకుంటూనే మరో పక్క ఓ సినిమాకు ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తుంది. భవిష్యత్తులో మోక్షద.. రవితేజ పేరుమీద ఓ నిర్మాణ సంస్థ ప్రారంభించి సినిమాలు తీస్తుందని సమాచారం. మొత్తానికి రవితేజ పిల్లలు ఇద్దరూ ఏం చేసినా సినీ పరిశ్రమలోనే అని ఫిక్స్ అయిపోయారు.
