Motorola Edge 70 Price Drop : అద్భుతమైన డిస్కౌంట్.. ఈ మోటోరోలా ఫోన్ చాలా చవక.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్..
Motorola Edge 70 Price Drop : మోటోరోలా ఎడ్జ్ 70 తగ్గింపు ధరకే లభిస్తోంది. బ్యాంకు ఆఫర్లతో ఈ ఫోన్ రూ. 25,559కే లభిస్తోంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ. 20,700 వరకు కొనేసుకోవచ్చు.
Motorola Edge 70 Price Drop
- ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గిన మోటోరోలా ఎడ్జ్ 70 ఫోన్
- బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో ధర రూ. 25,599కి కొనేసుకోవచ్చు
- 50MP డ్యూయల్ కెమెరాలు 5,000mAh బ్యాటరీ సెటప్
Motorola Edge 70 Price Drop : మోటోరోలా ఫ్యాన్స్ మీకోసమే.. రూ. 30వేల లోపు ధరలో మంచి ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. ఇంతకన్నా తక్కువకు మళ్లీ దొరకదు.. అసలే ఫోన్ల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.
అద్భుతమైన స్పెసిఫికేషన్లతో మంచి ఆల్-రౌండర్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ ఛాన్స్ అసలు వదులుకోవద్దు. ఇటీవలే లాంచ్ (Motorola Edge 70 Price Drop) అయిన మోటోరోలా ఎడ్జ్ 70 భారీ ధర తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 26,600 లోపే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 70 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో ధర ఎంత తగ్గిందంటే? :
అన్ని డిస్కౌంట్లతో మోటోరోలా ఎడ్జ్ 70 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వంటి ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ. 1,500పైగా ఆదా చేసుకోవచ్చు. తద్వారా ధర రూ. 25,599కి తగ్గుతుంది.
నెలకు రూ. 3,111 నుంచి ఈఎంఐ ద్వారా కొనేసుకోవచ్చు. మీ దగ్గర పాత్ ఫోన్ ఉంటే ఎక్స్చేంజ్ ద్వారా రూ. 20,700 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, ఫైనల్ ధర అనేది మీ ఫోన్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా తగ్గడం లేదా పెరగడం ఉంటుంది.
Read Also : America Voter ID Debate : ఇండియా తరహా ఓటర్ ఐడీ అమెరికా వల్ల అవుతుందా?
మోటోరోలా ఎడ్జ్ 70 స్పెసిఫికేషన్లు :
మోటరోలా ఎడ్జ్ 70 ఫోన్ 2712 × 1220-పిక్సెల్ రిజల్యూషన్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల కర్వ్డ్ pOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ ప్యానెల్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ పాంటోన్ వాలిడేషన్ ఉన్నాయి.
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్సెట్తో రన్ అవుతుంది. 12GB వరకు LPDDR5X ర్యామ్, 512GB స్టోరేజ్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. 68W వైర్డ్, 15W వైర్లెస్ ఛార్జింగ్‌తో 5,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తుంది.
ఈ ఫోన్ 5.99mm మందం, 159 గ్రాముల బరువు ఉంటుంది. ఎయిర్‌క్రాఫ్ట్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్, MIL-STD-810H సర్టిఫికేషన్, వాటర్, డస్ట్ రిసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్ అందిస్తుంది.
కెమెరాల విషయానికొస్తే.. OIS ఆటోఫోకస్‌తో 50MP ప్రైమరీ సెన్సార్, మాక్రో సపోర్ట్‌తో 50MP అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. ఫ్రంట్ కెమెరా కూడా ఆటోఫోకస్‌తో 50MPగా ఉంది. ఈ 2 కెమెరాలు 30fps వద్ద 4K వీడియోకు సపోర్ట్ చేస్తాయి.
