Oppo Find X9 Deal : ఒప్పో ఆఫర్ అదిరింది.. ఇలా కొన్నారంటే రూ. 22వేలు డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఎంతంటే?
Oppo Find X9 Deal : ఒప్పో అదిరే ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. అసలు ధర రూ. 84,999 నుంచి ఇప్పుడు రూ. 22,220 తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.
Oppo Find X9 Deal
- ఒప్పో ఫైండ్ X9 అధికారిక ధర రూ. 84,999
- ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 62,779 ధరకు లభిస్తోంది
- ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్‌పై రూ. 22,220 ఫ్లాట్ డిస్కౌంట్
- బ్యాంకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో మరింత ఆదా
Oppo Find X9 Deal : రూ. 65వేల లోపు ధరలో మంచి ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుత ఒప్పో ఫైండ్ X9 డీల్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ ఒప్పో ఫోన్ అధికారిక ధర రూ. 84,999 మాత్రమే. ఈ ఫోన్లో 6.59-అంగుళాల డిస్ప్లే, డైమెన్సిటీ 9500 చిప్సెట్, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 22వేల కన్నా భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఒప్పో ఫైండ్ X9 డీల్ :
ఒప్పో ఫైండ్ X9 అధికారిక ధర రూ. 84,999 ఉండగా ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫ్లాగ్షిప్ (Oppo Find X9 Deal) స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 62,779కే లభిస్తోంది. అంటే రూ. 22,220 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాదు.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ. 3,139 తగ్గింపు పొందవచ్చు. మరింత ఆదా కోసం పాత స్మార్ట్‌ఫోన్ కూడా ఎక్స్చేంజ్ చేయవచ్చు.
Read Also : Motorola Edge 70 Price Drop : అద్భుతమైన డిస్కౌంట్.. ఈ మోటోరోలా ఫోన్ చాలా చవక.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్..
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో ఫైండ్ X9 ఫోన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ 3,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.59-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ స్క్రీన్కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 80W వైర్డ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,025 mAh బ్యాటరీ అందిస్తుంది. 10W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే..
ఒప్పో ఫైండ్ X9లో 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా (సోనీ LYT-808, ఎఫ్/1.6, OIS), 50MP అల్ట్రావైడ్ కెమెరా (శాంసంగ్ JN5, f/2.0) 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (సోనీ LYT-600, 3x ఆప్టికల్ జూమ్, f/2.6, OIS) ఉన్నాయి. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లో ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా కూడా ఉంది.
ఈ కొనాలా వద్దా? :
మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ కోసం చూస్తుంటే.. ఒప్పో ఫైండ్ X9 అద్భుతమైన ఫోన్. అదిరిపోయే డిజైన్, డిస్ప్లే, పవర్ఫుల్ కెమెరాలు, ఆకట్టుకునే బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. రోజువారీ వాడకానికి అద్భుతంగా ఉంటుంది. మంచి కెమెరా, లాంగ్ బ్యాటరీ లైఫ్ పరంగా ఒప్పో ఫైండ్ X9 అన్ని విధాలా బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు.
