Ap CGF Scheme: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. వారికోసం ఏకంగా రూ.10 కోట్లు.. డైరెక్ట్ బ్యాంకులోకి
క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ (Ap CGF Scheme) పథకం కార్పస్ ఫండ్ కోసం రూ. 10 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
- V Santhosh Kumar
- Updated on- June 20, 2026 / 06:58 AM IST
Ap govt approves 10 crore for msme credit guarantee fund scheme
- MSME రంగానికి భారీ ఆర్థిక అండ
- రూ. 10 కోట్ల నిధులు మంజూరు
- పూచీకత్తు లేకుండా సులభంగా బ్యాంక్ రుణాలు
Ap CGF Scheme: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు ఆర్థికంగా మరింత అండగా నిలిచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ (Ap CGF Scheme) పథకం కార్పస్ ఫండ్ కోసం రూ. 10 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
Andira Bibaha: ఇదెక్కడి విడ్డూరం.. వర్షాల కోసం ఇద్దరు యువకులు పెళ్లి.. వైరల్ అవుతున్న వింత ఆచారం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) బడ్జెట్ కేటాయింపుల నుంచే ఈ నిధులను కేటాయించడం గమనార్హం. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు (MSME) బ్యాంకు గ్యారంటీ లేదా పూచీకత్తు లేకపోయినా సులభంగా రుణాలు పొందేలా ఈ పథకం సహాయపడుతుంది. ప్రభుత్వం విడుదల చేసిన ఈ రూ. 10 కోట్ల కార్పస్ ఫండ్ ద్వారా రాష్ట్రంలోని ఎంతోమంది చిన్న వ్యాపారులకు, నవ వ్యవస్థాపకులకు పెద్ద ఎత్తున రుణాలు అందే అవకాశం ఉంది.
కోవిడ్ తర్వాతి పరిణామాల్లో, మారుతున్న ఆర్థిక మార్కెట్‌లో ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రెడిట్ గ్యారంటీ నిధుల సాయంతో కొత్త పరిశ్రమల స్థాపన వేగవంతం కావడమే కాకుండా, స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని పరిశ్రమల శాఖ వర్గాలు భావిస్తున్నాయి.
