Andhra Pradesh : మా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది..అర్థం చేసుకోండి : మంత్రి ధర్మాన ప్రసాదరావు

మా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాం..పొమ్మన్నారు. ఇప్పుడు అమరావతిలో కూడా పెడితే వారుకూడా పొమ్మంటే ఎలా అందుకే విశాఖలోనే రాజధాని నిర్మిస్తున్నాం అని వ్యాఖ్యానించారు.

  • Updated on- July 13, 2023 / 11:55 AM IST

minister dharmana prasada rao siad negativity in public over ysrcp govt

Andhra Pradesh : మా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యతిరేకతకు కారణం సంస్కరణలను ప్రజలు అర్థం చేసుకోకపోవడమేనంటూ ప్రజలమీదనే ఆరోపణలు చేశారు సదరు మంత్రిగారు.మంగళవారం (నవంబర్ 8,2022) శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి ధర్మాన తమ ప్రభుత్వం సంస్కరణలు చేస్తోందని కానీ ఆ సంస్కరణలను ప్రజలు అర్థం చేసుకోవటంలేదని అందుకు మా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటూ వ్యాఖ్యానించారు. అంటే తమ ప్రభుత్వం పాలన ప్రజలకు అర్థం కావటంలేదన్నారు మంత్రి.

సాధారణంగా సంస్కరణలు చేసే వారికి ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ ఉంటుందని ..ఫలితాల సంస్కరణలు చేసేటప్పుడు ఫలితాలు ముందుగా రావని అన్నారు. ఈ కారణంగానే సంస్కరణలకు ప్రజల నుంచి ఆమోదం అంత త్వరగా రాదని అన్నారు. అయితే ప్రజలకు మేలు జరిగేందుకు ప్రజల్లో తొలుత వ్యతిరేకత వస్తుందని తెలిసినా… సీఎం జగన్ సంస్కరణల బాట పట్టారని మూడేళ్ల పాలనలో ఇప్పుడే మా ప్రభుత్వం సంస్కరణ బాట పట్టిందన్నారు మంత్రి ధర్మాన.

75 ఏళ్ల రాష్ట్ర సంపదను..సంస్థలను మనం హైదరాబాద్ లో పెట్టాం..అందుకే తెలంగాణవారికి ఆశకలిగింది అని చెప్పుకొచ్చిన మంత్రి ధర్మాన ఇప్పుడు అమరావతిలో డబ్బులు పెట్టాక వారు కూడా పొమ్మంటే ఏం చేయాలి? అందుకే ఉత్తర ఆంధ్రాలోనే రాజధాని నిర్మించాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే అమరావతి ఉత్తరాది ప్రాంతం వారిది కాదు అని మంత్రిగారి ఉద్ధేశమా?అనిపిస్తోంది ఆయన మాటల తీరు. విశాఖ రాజధానికి మధ్యలో లేదని విమర్శిస్తున్నారు. మరి చెన్నై,ముంబై, కోల్ కతాలు ఆ రాష్ట్రాల మధ్యలో ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. కాబట్టి విశాఖే అసలు రాజధానిగా ఉంటుందని మా ప్రభుత్వం విశాఖలో 500ల ఎకరాల్లో రాజధాని నిర్మిస్తుందని తెలిపారు. ప్రజలు హైకోర్టు పనులుంటే కర్నూలుకు.. అసెంబ్లీ సమావేశాలు సమయంలో అమరావతి వెళ్తాం అంటూ చెప్పుకొచ్చారు.