PRC Employees: ఉద్యోగుల పీఆర్సీపై మరోసారి చర్చలు

ఉద్యోగుల పీఆర్సీపై రెండ్రోజులుగా సాగుతున్న సుధీర్ఘ చర్చల్లో జేఏసీ నేతలు మరోసారి సమావేశం కానున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బుగ్గన, సజ్జల ఉద్యోగ సంఘం నేతలకు వివరించారు.

Employees Prc

PRC Employees: ఉద్యోగుల పీఆర్సీపై రెండ్రోజులుగా సాగుతున్న సుధీర్ఘ చర్చల్లో జేఏసీ నేతలు మరోసారి సమావేశం కానున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బుగ్గన, సజ్జల ఉద్యోగ సంఘం నేతలకు వివరించారు. 50శాతం ఫిట్ మెంట్ ఇస్తామని ప్రభుత్వం చెబుతుంటే.. ప్రభుత్వం 14.29శాతం ఇస్తామని చెబుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 14.29 శాతానికి అంగీకరించాలని ప్రభుత్వం కోరింది.

ప్రభుత్వం కార్యదర్శుల కమిటీ నివేదిక ఆమోదయోగ్యంగా లేదని ఉద్యోగ సంఘం నేతలు అనాసక్తి కనబరిచారు. జేఏసీ పదకండో పీఆర్సీ యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. కేంద్ర వేతన సంఘంతో తమకు సంబంధం లేదని ఉద్యోగ, కార్మిక, పెన్షన్ల సంఘాల నేతలు చెబుతున్నారు.

జేఏసీ తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పింది. ఉద్యోగుల సమస్యలపై గురువారం మరోసారి సజ్జల, బుగ్గనలతో జేఏసీ నేతలు భేటీ కానున్నారు. తర్వాత సీఎం జగన్ తో తుది విడత చర్చలు జరుపనున్నారు.

……………………….. : ఏపీలో మరో బస్సు ప్రమాదం…