Rain Alert: అలర్ట్.. ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన
అదే సమయంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చలి తీవ్రత క్రమంగా తగ్గుతోంది.
- T Venkateshwarlu
- Published On : February 20, 2026 / 07:44 AM IST
- అల్పపీడనం ఏర్పడే అవకాశం
- రేపటి నుంచి భారీ వర్షాలు
- రాయలసీమ, దక్షిణ తీర ప్రాంతాల్లో వానలు
Rain Alert: అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని ప్రక్కనే ఉన్న భూమధ్యరేఖకు ఆనుకుని హిందూ మహాసముద్రంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో, తమిళనాడు, కేరళలోని దక్షిణ ప్రాంతాల్లో రేపటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.
Also Read: Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్‌కు షాక్.. అతని ఇన్ స్టాగ్రామ్ పై బ్యాన్ విధించిన మెటా
రాయలసీమ, దక్షిణ తీర ప్రాంతాలకు కూడా వర్ష సూచన చేశారు. అల్పపీడనం వల్ల రేపటి నుంచి రాయలసీమలో కూడా వర్షాలు కురుస్తాయి. ఈ నెల 22 నుంచి దక్షిణ తీరప్రాంతంలోని అనేక జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.
అదే సమయంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చలి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. అయితే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే వేసవికాలం ప్రారంభమైందన్న సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బలమైన వేడిగాలులు వీస్తున్నాయి. మార్చి మొదటి వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
