AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు.. ఉత్తర్వులు జారీ చేసిన ఎస్ఈసీ!
ఆంధ్రప్రదేశ్‌లో 100 పట్టణ స్థానిక(AP Local Body Elections) సంస్థలకు సంబంధించిన ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఎస్ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది
- V Santhosh Kumar
- Published on- October 22, 2026 / 06:33 AM IST
Andhra Pradesh State Election Commission cancelled local body elections in 100 municipalities.
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా సాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఊహించని బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఎస్ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు ఉన్నాయి. తొలుత గొడవలు, వివాదాలు నమోదైన కొన్ని నిర్దిష్ట స్థానాల్లో మాత్రమే ప్రక్రియను ఆపాలని అధికారులు ప్రాథమికంగా భావించినప్పటికీ, ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, సమాన అవకాశాల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై ఒత్తిడి మేరకు తాత్కాలిక బ్రేక్ విధించారు.
CM Revanth Reddy: రేపు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. దసరా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్న సీఎం
సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు.. తుది జాబితా విడుదలకు బ్రేక్, ఎస్ఈసీ నిర్ణయం:
దేశ అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు (AP Local Body Elections)జారీ చేసిన కీలక ఆదేశాల నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ అత్యవసర నిర్ణయాన్ని తీసుకుంది. ఎన్నికల నామినేషన్ల దాఖలు, అభ్యర్థుల ఉపసంహరణ సమయంలో అక్రమాలు, హింసాత్మక సంఘటనలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లను పరిశీలించిన సుప్రీంకోర్టు, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లవద్దని సూచించింది. దీనితో మున్సిపల్ కమిషనర్లు, రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు పంపిన ఎస్ఈసీ, తదుపరి చట్టపరమైన మార్గదర్శకాలు వచ్చే వరకు 100 పట్టణ సంస్థల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిగా నిలిపివేసింది.
