AndhraPradesh: మాజీ ఎమ్మెల్యే రావి సహా పలువురికి బెయిల్.. భారీ ర్యాలీగా ఇంటికి వెళ్లిన టీడీపీ నేతలు

కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సహా పలువురు టీడీపీ నేతలకు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నాగలక్ష్మి బెయిల్ మంజూరు చేశారు. వైసీపీ కార్యాలయానికి భూముల కేటాయింపు అంశంపై టీడీపీ నేతలు ఆందోళన చేయగా వారిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే వారికి బెయిల్ వచ్చింది. దీంతో గుడివాడ కోర్టు నుంచి భారీ ర్యాలీగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు స్వగృహానికి చేరుకున్నారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, టీడీపీ నేత వర్ల కుమార్ రాజా కూడా పాల్గొన్నారు.

AndhraPradesh

AndhraPradesh: కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సహా పలువురు టీడీపీ నేతలకు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నాగలక్ష్మి బెయిల్ మంజూరు చేశారు. వైసీపీ కార్యాలయానికి భూముల కేటాయింపు అంశంపై టీడీపీ నేతలు ఆందోళన చేయగా వారిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే వారికి బెయిల్ వచ్చింది. దీంతో గుడివాడ కోర్టు నుంచి భారీ ర్యాలీగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు స్వగృహానికి చేరుకున్నారు.

ఈ ర్యాలీలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, టీడీపీ నేత వర్ల కుమార్ రాజా కూడా పాల్గొన్నారు. రావి వెంకటేశ్వరావుకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొడాలి నానిపై కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా మండిపడ్డారు. కొడాలి నాని, పేర్ని నాని సంయుక్తంగా వ్యాపారాలు చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు.

ఎమ్మెల్యేలుగా గెలిచింది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ ప్రజలను రోడ్డుపాలు చేయడానికేనా? అని అన్నారు. జగన్ ప్రభుత్వంలో పోలీసుల అరాచకాలు మితిమిరిపోయాయని చెప్పారు. దళితుల ఇళ్ల కూల్చివేతలను అడ్డుకున్న టీడీపీ నేతలను అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు. దుర్మార్గుడు కావాలో, నీతి నిజాయితీపరుడైన రావి వెంకటేశ్వర రావు కావాలో గుడివాడ ప్రజలు తెల్చుకోవాలని చెప్పారు. కొడాలి నాని నోరు చూస్తే కంపరం పుడుతుందని విమర్శించారు.

ఇల్లు కోల్పోయిన దళిత మహిళలకు కొడాలి నాని సమాధానం చెప్పాలని దేవినేని ఉమా అన్నారు. ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల లే అవుట్ల ధరలు పెరగడానికి, దళితుల ఉసురు తీసుకుంటారా? అని నిలదీశారు. చంద్రబాబు, లొకేశ్ ను తిట్టడానికే కొడాలి నాని గుడివాడ అమరావతి వస్తున్నారని అన్నారు.

రోడ్లు వేయడం చేతకాని కొడాలి నాని ఒక ఎమ్మెల్యేనా? అని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసిన న్యాయమే గెలిచిందని రావి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతోందని చెప్పారు. అమ్మాయిలతో డ్యాన్స్ లు చేయించి, డబ్బులు సంపాదించే దుర్మార్గుడు కొడాలి నాని అని విమర్శించారు.

Rahul Gandhi: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి అదానీ ఎంత ధనాన్ని ఇచ్చారు?: పార్లమెంటులో రాహుల్