Minister Roja protocol : శ్రీశైలంలో మంత్రి రోజా ప్రొటోకాల్ వివాదం .. ఆహ్వానం పలకటానికి రాని పాలకమండలి చైర్మన్‌పై అసహనం

కార్తీక మాసం కావటంతో శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కొలువైన మల్లికార్జున స్వామిని మంత్రి రోజా దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన మంత్రి రోజాకు దేవస్థానం ఛైర్మన్ చక్రపాణి రెడ్డి ఆహ్వానం పలకలేదు. దీంతో మంత్రి రోజా ఫైర్ అయిపోతున్నారు. కావాలనే తనను అవమానించటానికే పాలకమండలి ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణి రాలేదంటూ అసహనం వ్యక్తంచేశారు.

minister roja protocol dispute in srisailam Temple

Minister Roja protocol in srisailam : ఎమ్మెల్యేగా ఉన్నన్నాళ్లు జబర్ధస్ ప్రోగ్రామ్ కే పరిమితమైన రోజా మంత్రి అయ్యాక మాత్రం దేవాలయాల దర్శనాల్లో మునిగితేలుతున్నారు. దాదాపు 40సార్లు తిరుమలను దర్శించుకున్న రోజా తాజాగా కార్తీక మాసం కావటంతో శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కొలువైన మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. మంత్రి హోదాలో  రోజా దేవాలయ దర్శనికి వచ్చిన క్రమంలో ప్రొటోకాల్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.దర్శనానికి వచ్చిన మంత్రి రోజాకు దేవస్థానం ఛైర్మన్ చక్రపాణి రెడ్డి ఆహ్వానం పలకలేదు. దీంతో మంత్రి రోజా ఫైర్ అయ్యారు. కావాలనే తనను అవమానించటానికే పాలకమండలి ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణి రాలేదంటూ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.

తాను దేవాలయం దర్శనానికి వచ్చిన క్రమంలో తను ఆహ్వానించానికి పాలకమండిలి ఛైర్మన్ చక్రపాణి రావాలని ఎదురు చూశారు. కానీ ఆయన రాలేదు. దీంతో  మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తంచేశారు. చక్రపాణి అవుటాఫ్ స్టేషన్ ఉన్నారా? అంటే అదీలేదు. ఆయన శ్రీశైలంలోనే ఉన్నారు. అయినా మంత్రి హోదాలో తాను వస్తే ఆహ్వానం పలకటానికి రాలేదని మండిపడిపోయారు రోజమ్మ. చక్రపాణి రాకపోవటంతో ఆలయ ఈవో లవన్న..ఇతర అధికారులు ఆలయ మర్యాదలతో రోజాకా ఆహ్వానం పలికారు.

అనంతరం భ్రమరాంబ, మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న రోజా.ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా..ఈ ఘటనతో మంత్రి రోజా, ఛైర్మన్ చక్రపాణి రెడ్డిల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇద్దరిదీ ఇకే నియోజకవర్గం కావటంతో రోజా చక్రపాణిల మధ్య విభేధాలు కొనసాగుతున్నాయని మరోసారి రుజువైంది. ఈక్రమంలో కావాలనే చక్రపాణి తనను ఆహ్వానించటానికి రాలేదంటూ అసహనం వ్యక్తంచేశారు రోజా.