Another Controversy Over The Birthplace Of Hanuman
birthplace of Hanuman : హనుమంతుడి జన్మస్థలంపై మరో వివాదం నెలకొంది. హనుమంతుడు తిరుమలలోనే జన్మించాడంటూ టీటీడీ చేసిన ప్రకటనపై మరో వివాదం చెలరేగింది. టీటీడీ చేసిన ప్రకటనపై హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
టీటీడీ ప్రకటనను కర్నాటక హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తప్పుబట్టింది. ఈ మేరకు టీటీడీకి ఆరు పేజీల లేఖ రాసింది. అజ్ఞానపు, మూర్ఖపు పనులు చేయవద్దని ఘాటుగా వ్యాఖ్యానించింది.
కల్పితాలు సృష్టించవద్దని టీటీడీకి విజ్ఞప్తి చేసింది. శాస్త్రీయ ఆధారాలతో వారంలోగా తమ లేఖకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే తామే తిరుమల వచ్చి తప్పును నిరూపిస్తామని హెచ్చరించింది.