Andhra Pradesh : ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. రూ. 71,602 కోట్ల పెట్టుబడులు.. 14250 మందికి ఉద్యోగావకాశాలు..

Andhra Pradesh : రాష్ట్రంలో రూ.71,602.60కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు వివిధ సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాయి. వాటి ద్వారా 14,190 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థలు పేర్కొన్నాయి.

Another data center in Visakhapatnam

  • విశాఖలో మరో డేటా సెంటర్
  • రూ.58,743 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు ప్రతిపాదన
  • రూ.71,602 కోట్ల పెట్టుబడులకు వివిధ సంస్థ ఆసక్తి

Andhra Pradesh : ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఉత్తరాంధ్రకు వరుసగా ఐటీ కంపెనీలతోపాటు డేటా సెంటర్లు, పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు రాగా.. తాజాగా మరో డేటా సెంటర్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి.

Also Read : PM Modi New Video : ధన్యవాదాలు మిత్రులారా అంటూ.. అర్థరాత్రి మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ

రాష్ట్రంలో డేటా సెంటర్, లిథియం అయాన్ బ్యాటరీల తయారీ, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్, సోలార్ ఇన్‌గాట్, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు వివిధ సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ) పరిశీలించింది. రాష్ట్రంలో రూ.71,602.60కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు వివిధ సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాయి. వాటి ద్వారా 14,190 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థలు పేర్కొన్నాయి.

ఎస్ఐసీసీలో చర్చించిన ప్రతిపాదనల్లో.. ప్రధానంగా విశాఖపట్టణంలో మరో డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. రూ.58,743 కోట్ల పెట్టబడులతో డేటా సెంటర్ హోల్డింగ్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ లార్జ్ స్కేల్ డేటా సెంటర్ ఫెసిలిటీ ఏర్పాటుకు ప్రతిపాదన వచ్చింది. రాబోయే ఐదేళ్లలో ఐదు దశల్లో పెట్టబడులు పెట్టేందుకు ఆ సంస్థ ప్రతిపాదన చేసింది. దీని ద్వారా 1250 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

అదేవిధంగా.. కర్నూలు జిల్లా గుట్టపాడు ఇండస్ట్రియల్ పార్కులో అగస్త్య గ్రీన్‌ఎనర్జీ లిమిటెడ్ రూ.7,799.96 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ 12 గిగావాట్ల సోలార్ ఇన్‌గాట్, 12 గిగావాట్ల సోలార్ వేఫర్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుతో వెయ్యి మందికి ఉపాధి లభించనుంది. ఇందుకోసం ఎకరాకు రూ.10 లక్షల చొప్పున 156.96 ఎకరాల భూమిని కేటాయించాలని కోరింది. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ రూ.2,125 కోట్ల పెట్టుబడితో ఫాస్పారిక్ యాసిడ్ మరియు అనుబంధ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ పరిశ్రమ ద్వారా 400 మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపి, 450 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. నెల్లూరు జిల్లా మనుబోలులో వీపీఆర్ మైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.500 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించింది.

కడప జిల్లా కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (EMC)లో ఏఐఎల్ డిక్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.450 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అదే విధంగా నెల్లూరు జిల్లాలో ప్రిసోల్ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.330.71 కోట్ల పెట్టుబడితో కొత్త పరిశ్రమ ఏర్పాటు చేసి 1,110 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రతిపాదించింది.

ఈ పారిశ్రామిక ప్రతిపాదనలతో పాటు, కొన్ని సంస్థలు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, గతంలో మంజూరు చేసిన అనుమతుల్లో సవరణలు చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరాయి. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు వేలాది యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.