Jobs : ఏపీపీఎస్సీ మరో 2 నోటిఫికేషన్లు
ఏపీ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం మరో 2 నోటిఫికేషన్లు విడుదల చేసింది.
- kunduru Vinod
- Published On : October 1, 2021 / 06:52 AM IST
Jobs
Jobs : ఏపీ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురువారం మరో 2 నోటిఫికేషన్లు విడుదల చేసింది. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ పోస్టులు 6, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులు నాలుగు భర్తీ చేయడానికి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ పోస్టులకు అక్టోబర్ 22 నుంచి నవంబర్ 12 వరకు, డీపీఆర్వో పోస్టులకు అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9 వరకు దరఖాస్తు గడువుగా నిర్ణయించినట్లు కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు పేర్కొన్నారు. ఇక తాజాగా వైద్యశాఖలో భారీగా పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Read More : peon job..15 lakh applications : ప్యూన్ ఉద్యోగానికి 15 లక్షల దరఖాస్తులు..అందరూ డిగ్రీ,పీజీలు చేసినవారే
