peon job..15 lakh applications : ప్యూన్‌ ఉద్యోగానికి 15 లక్షల దరఖాస్తులు..అందరూ డిగ్రీ,పీజీలు చేసినవారే

ప్యూన్ ఉద్యోగం కోసం ఏకంగా 15లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా డిగ్రీ, పీజీ, ఎంఫిల్ చేసినవారు ప్యూన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు.

peon job..15 lakh applications : ప్యూన్‌ ఉద్యోగానికి 15 లక్షల దరఖాస్తులు..అందరూ డిగ్రీ,పీజీలు చేసినవారే

Pakistan Unemployment

15 lakh persons applied for a peon job: ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్యూన్ ఉద్యోగానికి 10th class చదివితే సరిపోయేది.కానీ ఇప్పుడో జనాభా పెరిగింది.కానీ తగినన్ని ఉద్యోగాలు లేవు. దీంతో నిరుద్యోగులు పెరుగుతున్నారు.దీంతో కేవలం ప్యూన్ ఉద్యోగానికి కూడా లక్షల సంఖ్యలో అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు డిగ్రీ చదివినవారు పీజీలు చేసిన వారు కూడా. దీన్ని బట్టి నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం పాకిస్థాన్ దేశంలో పరిస్థితి ఎలా ఉందీ అంటూ దేశంలోని ఓ హైకోర్టులో  ఒక ప్యూన్ ఉద్యోగానానికి లక్షల సంఖ్యలో అప్లికేషన్లు పెట్టుకున్నారు నిరుద్యోగులు.

పాకిస్తాన్‌లో నిరుద్యోగం భారీగా పెరిగిన క్రమంలో ప్యూన్ ఉద్యోగానికి ఏకంగా 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే పాక్ లో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. డాన్ న్యూస్ పత్రిక ప్రకారం..పాకిస్థాన్ ప్రభుత్వంలో నిరుద్యోగం రేటు 6.5 శాతంగా ఉందని పేర్కొంది. కానీ అది అంతకంటే ఎక్కువే ఉన్నట్లుగా తెలుస్తోంది.

Read more : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : త్వరలో నిరుద్యోగ భృతి

పాకిస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ (PIDE) ప్రకారం, నిరుద్యోగ రేటు 16 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఈ నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతుందని.. దేశంలో కనీసం 24 శాతం మంది విద్యావంతులు నిరుద్యోగులుగా ఉన్నారని పీఐడీఈ పేర్కొంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ప్యూన్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగల గురించి డేటాలో వెల్లడించింది. ఇటీవల దేశంలోని ఒక హైకోర్టులో ప్రకటించిన ప్యూన్‌ ఉద్యోగం కోసం 15 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారనీ..దేశంలో పెరుగుతున్న నిరుద్యోగానికి ఇదే నిదర్శనమంటూ పేర్కొంది.

ఈ ప్యూన్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో డిగ్రీ హోల్డర్లే కాదు పీజీ చేసినవారు,ఎంఫిల్ చేసినవారు కూడా ఉండటం గమనించాల్సిన విషయం. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్‌ మీడియానే వెల్లడించింది.పాకిస్తాన్‌లో బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBS) ప్రచురించిన ఒక సర్వే ప్రకారం.. పాకిస్తాన్‌లో 2017-18లో నిరుద్యోగం 5.8 శాతంగా ఉందని.. 2018-19లో 6.9 శాతానికి పెరిగిందని తెలిపింది.

Read more : Civils Rank : సివిల్స్ లో మెరిసిన గోల్డ్ మెడలిస్ట్… చిన్నవయస్సులోనే నెరవేరిన లక్ష్యం

ఇమ్రాన్‌ ప్రభుత్వంలో నిరుద్యోగ రేటు భారీగా పెరిగినట్లు మీడియా వెల్లడించింది. పురుషుల నిరుద్యోగ రేటు 5.1 శాతం నుంచి 5.9 శాతానికి, మహిళా నిరుద్యోగ రేటు 8.3 శాతం నుంచి 10 శాతానికి పెరిగినట్లు డాన్ నివేదించింది. కాగా..ఈ సంవత్సరం జూన్‌లో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో కోవిడ్ -19 మహమ్మారి కారణంగా, ఉద్యోగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని..లాక్ డౌన్ కారణంగా దాదాపు 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని వెల్లడించింది.