Civils Rank : సివిల్స్ లో మెరిసిన గోల్డ్ మెడలిస్ట్… చిన్నవయస్సులోనే నెరవేరిన లక్ష్యం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బారాబంకీ జిల్లాకు చెందిన ఆద‌ర్శ్ కాంత్ శుక్లా.. త‌ల్లిదండ్రులు రాధాకాంత్‌, గీతా శుక్లా. రాధాకాంత్ ఓ ప్ర‌యివేటు కంపెనీలో అకౌంటెంట్ కాగా, త‌ల్లి గృహిణి. ఆద‌ర్శ్

Civils Rank : సివిల్స్ లో మెరిసిన గోల్డ్ మెడలిస్ట్… చిన్నవయస్సులోనే నెరవేరిన లక్ష్యం

Civils

Civils Rank :  కృషి, పట్టుదల, దేనినైనా సాధించాల‌న్న తపన ఉంటేచాలు నెరవేరని లక్ష్యం అంటూ ఏమీ ఉండ‌దు. అందుకు చేయాల్సిందల్లా తగినంత కృషి. ఇలా చేస్తే వచ్చే ఫలితం మాత్రం ఊహకందని విధంగా ఉండటమే కాదు చెప్పలేనంత సంతోషాన్ని కలిగిస్తుంది. 22 ఏళ్ళ వయస్సుకే సివిల్స్ ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభకనబరిచాడు ఓ యువ‌కుడు… ఇటీవ‌ల విడుద‌లైన సివిల్స్ ఫ‌లితాల్లో 149 ర్యాంకు సాధించి ప‌లువురికి ఆద‌ర్శంగా నిలిచాడు. అతనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బారాబంకీ జిల్లాకు చెందిన ఆద‌ర్శ్ కాంత్ శుక్లా.. త‌ల్లిదండ్రులు రాధాకాంత్‌, గీతా శుక్లా. రాధాకాంత్ ఓ ప్ర‌యివేటు కంపెనీలో అకౌంటెంట్ కాగా, త‌ల్లి గృహిణి. ఆద‌ర్శ్ కాంత్ సోద‌రి స్నేహ ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. అయితే త‌న కొడుకును సివిల్ స‌ర్వెంట్ చేయాల‌న్న‌ది రాధాకాంత్ బ‌ల‌మైన కోరిక‌. ఇదే విష‌యాన్ని ఆద‌ర్శ్‌కు సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా తండ్రి చెప్పేవారు. అలా సివిల్ స‌ర్వీసెస్ సాధించాల‌న్న త‌ప‌న ఆద‌ర్శ్‌లో మొద‌లైంది. కుటుంబసభ్యుల ప్రోత్సహంతో మొక్కవోని దీక్షతో తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు.

చిన్ననాటి నుండే చదువులో ఆద‌ర్శ్ కాంత్ అందరికంటే మిన్నగా ఉండే వాడు. హైస్కూల్‌, ఇంట‌ర్రీడియ‌ట్‌లో టాప‌ర్. ల‌క్నోలోని నేష‌న‌ల్ పీజీ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. బీఎస్సీ(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ‌మేటిక్స్‌)లో అత్యుత్త‌మ మార్కులు సాధించి బంగారు ప‌త‌కాన్ని సంపాదించారు. ఇక డిగ్రీ పూర్త‌వ‌గానే సివిల్స్ పై దృష్టి పెట్టాడు. తొలి నుండి తాను సివిల్స్ ర్యాంక్ సాధించగలనన్న నమ్మకంతో ఉన్న ఆద‌ర్శ్, తొలి ప్ర‌య‌త్నంలోనే 149వ ర్యాంకు సాధించారు.

అందరిలా సివిల్స్ కు ప్రిపరేషన్ కోసం ఎలాంటి కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేదు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే అతను ఈ విజ‌యాన్ని సాధించ‌డం విశేషం. 22 ఏండ్ల వ‌య‌సులోనే సివిల్స్ లో మంచి ర్యాంకు సాధించ‌డంతో ప‌లువురు ఆద‌ర్శ్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. అటు కుటుంబసభ్యులు తమ కుమారుడు సాధించన ఘనతతో ఆనందంలో సంబరపడుతున్నారు.