×
Ad

అందుకే మిమ్మల్ని తైతక్కల రోజా అనాల్సి వస్తోంది: పంచుమర్తి అనురాధ

"వైసీపీ హయాంలో నాసిరకం మద్యంతో ప్రజల రక్తాన్ని స్ట్రా వేసి మరీ పీల్చేశారు. అది గుర్తుంచుకోండి" అని అన్నారు.

Panchumarthi Anuradha: మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా తీరుపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ఇవాళ అమరావతిలో పంచుమర్తి అనురాధ మాట్లాడారు.

“రోజా.. మీరు మాట మీద నిలకడగా ఉండరు కాబట్టి మిమ్మల్ని తైతక్కల రోజా అనాల్సి వస్తోంది. పీనుగ పోయినా… ఆ పీనుగ చేసిన పాపం ఇంకా అక్కడ అక్కడ కన్పిస్తూనే ఉంది తైతక్కల రోజా. వైసీపీ హయాంలో నాసిరకం మద్యంతో ప్రజల రక్తాన్ని స్ట్రా వేసి మరీ పీల్చేశారు. అది గుర్తుంచుకోండి.

Also Read: నాపై ఆయన ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడంలేదు.. ఎందుకు ఇంత ఈర్ష్య?: మంత్రి వివేక్ సంచలన కామెంట్స్‌

మీ పాపాల్ని తుడిచే ప్రయత్నంలోనే మొలకల చెరువులో కల్తీ సారా వ్యవహరం వెలుగులోకి వచ్చిందనే విషయం తెలుసుకోండి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కల్తీ సారా పాపం పురుడు పోసుకుంది. దాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బయట పెట్టింది. మొలకల చెరువు కల్తీ సారా అంశాన్ని బయట పెట్టింది మా సర్కారే.

మేము ప్రక్షాళన చేస్తుంటే.. ఆ పాపాన్ని ప్రభుత్వంపై నెడతున్నారు. గొడ్డలి పోటు నుంచి గులక రాయి వరకు మీ డ్రామాలు చూశాం. మీరు ఇలా మాట్లాడ్డం… మాకేం ఆశ్చర్యమనిపించడం లేదు. తప్పు మీరు చేయడం.. నెపాన్ని మా మీద నెట్టడం మీకు అలవాటేగా?

వివేక హత్య కేసులో సీబీఐ ఎంక్వైరీ వద్దని జగన్ ఎందుకు డిమాండ్ చేశారనే దానికి సమాధానం చెప్పి.. ఆ తర్వాత కల్తీ లిక్కర్ వ్యవహరం మీద సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తే బాగుంటుంది” అని అన్నారు.