నాపై ఆయన ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడంలేదు.. ఎందుకు ఇంత ఈర్ష్య?: మంత్రి వివేక్ సంచలన కామెంట్స్
"లక్ష్మణ్‌ని రెచ్చగొట్టి కొందరు విమర్శలు చేయించారు" అని వివేక్ అన్నారు.

Vivek Venkataswamy
Vivek: నిజామాబాద్‌లో జరిగిన మాలల ఐక్య సదస్సలో తెలంగాణ మంత్రి వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేశారని అన్నారు.
మంత్రిగా తాను ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కులం ఆధారంగా కుట్రలు, విమర్శలు చేస్తున్నారని వివేక్ చెప్పారు. “లక్ష్మణ్‌ని రెచ్చగొట్టి కొందరు విమర్శలు చేయించారు. (Vivek)
జూబ్లీహిల్స్‌లో పార్టీ గెలిస్తే నాకు మంచిపేరు వస్తుందని విమర్శలు చేసున్నారా? నాపై లక్ష్మణ్ ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడంలేదు. వేదికపైకి లక్ష్మణ్ వచ్చినపుడు నేను వెళ్లిపోతున్నానని అనటం అబద్ధం.
నేను మాల జాతి అని మంత్రి లక్ష్మణ్ విమర్శలు చేస్తున్నారు. నాకు మంత్రి పదవిపై మోజు లేదు. లక్ష్మణ్‌ను రాజకీయంగా ప్రోత్సహించింది కాకానే అని మర్చిపోతున్నాడు. నా మీద ఎందుకు ఇంత ఈర్ష్య.. నేను అందరితో కలిసి కట్టుగా ఉంటాను” అని చెప్పారు.