మార్చి 28 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు…ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 

మార్చి 28 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. నాలుగు రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.

  • Publish Date - March 9, 2020 / 03:22 PM IST

మార్చి 28 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. నాలుగు రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.

మార్చి 28 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. నాలుగు రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని జగన్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక పక్క ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈనెల 28న బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి దాదాపు నాలుగు రోజులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల చివరి వరకు సమావేశాలు పూర్తి చేయాల్సివుంది. 

అయితే పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టి, నాలుగు రోజుల్లోనే సమావేశాలు పూర్తి చేయాలని భావిస్తోంది. పూర్తి స్థాయి బడ్జెట్ జూన్ లేదా జులై నెలలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి ఒక నిర్ణయిం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ రోజ సాయంత్రం వైసీపీ కీలక నేతలతో సీఎం జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో దీనికి సంబంధించి చర్చ కూడా జరిగినట్లు సమాచారం. 30 లేదా 31 తేదీల్లో ఒటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు రావాల్సివుండగా ప్రభుత్వం మార్చి 28 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహంచే ఆలోచనలో ఉంది.