×
Ad

Somu Veerraju : ఏపీ రాజధాని ఒక్కటే.. అది అమరావతే.. బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని తేల్చి చెప్పారు. అదొక్కటే రాజధానిగా ఉంటుందన్నారు. ఈ మాటకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు.

  • Published On : November 21, 2021 / 07:42 PM IST

Somu Veerraju Amaravathi

Somu Veerraju : ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్ర చేస్తున్నారు. రైతుల మహాపాదయాత్రకు ఏపీ బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. అమరావతికి మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలి దగ్గర బీజేపీ, అమరావతి రైతుల ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించారు. ఈ సభకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తదితరులు హాజరయ్యారు.

Sonu Sood : వైసీపీ నేతల వైఖరి సరికాదన్న సోనూసూద్.. చంద్రబాబుకి ఫోన్‌లో పరామర్శ

రాజధానిపై సోము వీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు. అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని తేల్చి చెప్పారు. అదొక్కటే రాజధానిగా ఉంటుందన్నారు. ఈ మాటకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. అందువల్లే అమరావతిలో అనేక పనులకు కేంద్రం నుంచి నిధులు వచ్చాయని వెల్లడించారు. అంతేకాదు రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని అమరావతిలోనే నిర్మిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రైతుల పాదయాత్రలో చివరి వరకు బీజేపీ పాల్గొంటుందని, అమరావతి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. కాగా, ఏపీ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు అమరావతి నుంచి తిరుమల వరకు మహాపాదయాత్రగా వెళ్తున్నారు.

రాజధాని ఎక్కడికీ పోదని, అమరావతే ఏపీ రాజధాని అంటూ తాము మొదటి నుంచి ఇదే మాటకు కట్టుబడి ఉన్నామన్నారు ఎంపీ సుజనా చౌదరి. సాంకేతిక, న్యాయపరమైన అంశాలు చూసే తాను ఆనాడు మాట్లాడానన్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం సూచనతోనే నేతలంతా పాదయాత్రకు వెళ్తున్నామన్నారు. ఏ క్షణమైన రాజధాని తరలిపోతుందని చెప్పే వార్తలను తాము పట్టించుకోమని సుజనా చౌదరి స్పష్టం చేశారు.

WhatsApp Web Tricks : వాట్సాప్‌ వెబ్‌లో ఈ సూపర్ షార్ట్‌కట్స్‌.. తప్పక తెలుసుకోండి!