AP Budget 2026 : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించే శాఖలకు కేటాయింపులు ఇలా..
AP Budget 2026 : ఏపీ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
- Harishth Thanniru
- Published On : February 14, 2026 / 12:55 PM IST
Pawan Kalyan
- అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించే పంచాయతీరాజ్ శాఖకు రూ.22,942 కోట్లు
- పర్యావరణం, అటవీ, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత శాఖకు రూ.714కోట్లు
AP Budget 2026 : ఏపీ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అనంతరం బడ్జెట్‌లో శాఖల వారిగా కేటాయింపుల వివరాలను పయ్యావుల కేశవ్ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు.
Also Read : AP Budget 2026 : ఏపీ వార్షి బడ్జెట్ రూ.3,32,205 కోట్లు.. శాఖల వారిగా కేటాయింపులు ఇలా..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు బడ్జెట్‌లో నిధులు కేటాయింపులు చేశారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.22,942 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖచిత్రం రూపాంతరం చెందుతోందని అన్నారు.
పవన్ కల్యాణ్ నిర్వహించే పర్యావరణం, అటవీ, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత శాఖలకు కలిపి బడ్జెట్‌లో రూ.714 కోట్లను కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను హరిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అన్నారు.
2030 నాటికి 37శాతం, 2047 నాటికి 50శాతం పచ్చదనం సాధించే దిశగా అటవీ సంపదను స్థిరంగా నిర్వహించడం, ఎడారీకరణను ఎదుర్కోవడం వంటి చర్యలను అమలు చేస్తామని అన్నారు. వ్యూహాత్మక పర్యావరణ రక్షణ వలయంగా గ్రీన్ కవర్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ను అమలు చేయనున్నట్లు చెప్పారు.
