AP Budget 2026 : నారా లోకేశ్‌కు కొత్త బిరుదు.. అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్‌లో ప్రకటన..
AP Budget 2026 : ఏపీ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తన బడ్జెట్ ప్రసంగం సమయంలో మంత్రి నారా లోకేశ్ కు కొత్త బిరుదు ఇచ్చారు.
- Harishth Thanniru
- Published On : February 14, 2026 / 01:14 PM IST
Nara Lokesh
- అసెంబ్లీలో ఏపీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్
- మంత్రి నారా లోకేశ్‌కు కొత్త బిరుదు
- అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల ప్రకటన
AP Budget 2026 : ఏపీ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అనంతరం బడ్జెట్ లో శాఖల వారిగా కేటాయింపుల వివరాలను పయ్యావుల కేశవ్ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకఏశ్ కు కొత్త బిరుదు ఇచ్చారు.
Also Read : AP Budget 2026 : ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లు.. శాఖల వారిగా కేటాయింపులు ఇలా..
పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద సింగిల్ ఎఫ్‌డిఐ పెట్టుబడిని ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గురించి ప్రపంచం మాట్లాడుకుంటోంది. గట్టి అంతర్జాతీయ, జాతీయ పోటీ మధ్య విశాఖపట్టణంలో గూగుల్ సంస్థతో 15 బిలియన్ డాలర్లు (రూ.1.35లక్షల కోట్లు) విలువైన ఏఐ ఆధారిత డేటా సెంటర్ స్థాపనకు ఒప్పందం కుదుర్చుకున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ పేరును ప్రస్తావించి పయ్యావుల ప్రశంసల వర్షం కురిపించారు.
ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ‘బ్రాండ్ చంద్రబాబు’ను సమర్థవంతంగా వినియోగించి ఈ చారిత్రక (గూగుల్ సంస్థతో) ఒప్పందాన్ని సాధించారు. ఆయన్ను ‘ఆంధ్రప్రదేశ్ చీఫ్ జాబ్ క్రియేటర్’గా కొనియాడటం సముచితం అని పయ్యావుల అన్నారు. అదనంగా అనకాపల్లిలో సమగ్ర ఉక్కు కర్మాగారం, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, సమగ్ర పౌర సెల్ ప్రాజెక్టు, 500 సీబీజీ ప్లాంట్లు, కాకినాడలో పెట్టుబడులు ఆకర్షించగలిగామని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున 175 ఎంఎస్ఎంఈ పార్కులు, కృష్ణపట్నం, ఓర్వకల్, కొప్పర్తి పారిశ్రామిక నోడల్ అభివృద్ధి చెందుతున్నాయని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
