సీఎం జగన్ ప్రాణానికి..భద్రతకు ముప్పు వచ్చిన విధంగా ఆలోచించినప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. గాయంపై కారం చల్లి పైశాచిక ఆనందం పొందుతారా ? ఎప్పుడు బయటకు రాని మహిళలు..ఈ రోజు రోడ్లపైకి వచ్చే విధంగా చేసినందుకు జగన్ సిగ్గు పడాలన్నారు. రాజధానిపై ఏపీ కేబినెట్ నిర్ణయాలపై ఆయన మండిపడ్డారు. 2019, డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం బాబు మీడియాతో మాట్లాడుతూ…
సీఎం జగన్ ఆక్టోపాస్‌ను పెట్టుకుని ముందుకు వెళ్లారని, ముందు ట్రయల్ నిర్వహించారని చెప్పారు. ఇంటి దగ్గర 144 సెక్షన్ పెట్టి, ప్రజాదర్బార్ క్యాన్సిల్ చేసుకున్నారని విమర్శించారు. తమ పార్టీ, ఇతర పార్టీలకు చెందిన వారిని హౌస్ అరెస్టు చేస్తారా ? అంటూ నిలదీశారు. ఉన్మాద చర్యలు తీసుకోవద్దని హితవు పలికారు బాబు. డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం నాడు జరిగిన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనిపై బాబు తీవ్రంగా మండిపడ్డారు.
ప్రభుత్వాలు మారినప్పుడు రాజధానిని మారుస్తారా ? అంతా మీ ఇష్టమేనా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి ప్రజా రాజధాని అని తేల్చిచెప్పారు. డబ్బులు లేవనడం ఒక నెపమని, విశాఖలో రాజధాని నిర్మిస్తే..సెక్రటేరియట్, అసెంబ్లీ ఇతరత్రా వాటిని ఎలా నిర్మిస్తారని సూటిగా ప్రశ్నించారు బాబు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణం కోసం తమ ప్రభుత్వ హాయంలో ఎంత ఖర్చు పెట్టామో లెక్కలు వినిపించారు.
Read More : రాజధాని..చంద్ర నిప్పులు : కావాలనే డబ్బులు లేవంటున్నారు