CM Jagan-Ramakrishna : రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, సీపీఐ నేత రామకృష్ణ

పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక అని తెలిపారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.

CM Jagan-Ramakrishna : ముస్లీం సోదరులు ఘనంగా రంజాన్ వేడుకలు జరుపుకుంటున్నారు. మసీదులు, మైదానాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ముస్లిం సోదరులకు ఏపీ సీఎం జగన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు సీఎం జగన్‌ రంజాన్ శుభాకాంక్షలు(ఈద్‌ ముబారక్‌) తెలిపారు.

మానవాళికి హితాన్ని బోధించే రంజాన్‌ పండుగ… సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని సీఎం జగన్ కొనియాడారు. కఠోర ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ, దానధర్మాలతో దాతృత్వం, సామూహిక ప్రార్థనలతో ధార్మిక చింతన, ఐకమత్యం.. ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని పేర్కొన్నారు.

Ramzan Celebrations : దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు.. శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని

పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక అని తెలిపారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని సీఎం జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.

ముస్లిం సోదరులందరికీ సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, ఓర్పు, సహనం, క్షమాగుణాలకు ప్రతీక రంజాన్ అని పేర్కొన్నారు. నెల రోజుల కఠోర ఉపవాస దీక్షలకు ముగింపు పవిత్ర రంజాన్ పర్వదినం అని కొనియాడారు.

ట్రెండింగ్ వార్తలు