Black Fungus Symptoms In Non Covid Person
Black Fungus Symptoms in Non Covid person : కరోనా నుంచి కోలుకున్నవారికే బ్లాక్ ఫంగస్ సమస్యలు వస్తున్నాయని ఇప్పటి వరకూ నిపుణులు చెప్పిన మాట. కానీ కోవిడ్ సోకకున్నా.. బ్లాక్ ఫంగస్ ప్రమాదం ఉందని తెలిపారు డాక్టర్లు. సీఎం జగన్ ఏపీలో కరోనా పరిస్థితులు..బ్లాక్ ఫంగస్ సమస్యలపై రివ్వ్యూ నిర్వహించారు.
ఈ రివ్వ్యూలో డాక్టర్లు సీఎం జగన్ కు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇప్పటి వరకూ కరోనా సోకినవారికే బ్లాక్ ఫంగస్ సమస్యలు ఉండేవని..కానీ కోవిడ్ సోకనివారికి కూడా బ్లాక్ ఫంగస్ సమస్యలు వస్తున్న విషయాన్ని సీఎం జగన్ కు వైద్య అధికారులు వివరించారు. కోవిడ్ సోకని 40మందికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు గుర్తించామని తెలిపారు. అలా ఇప్పటి వరకూ కోవిడ్ సోకని 40మందిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు గుర్తించామని..తెలిపారు.
డయాబెటిస్ అధికంగా ఉన్నవారిలో ఈ బ్లాక్ ఫంగస్ లక్షణాలకు గుర్తించామని సీఎం కు వివరించారు. ఈ కీలక విషయాలన్నీ విన్న సీఎం బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లను..దానినికి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇటువంటి వింత కేసులతో ఏపీ వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కాగా ఇప్పటికే ఏపీలో 1179మందికి బ్లాక్ ఫంగస్ సోకింది. వీరిలో 40మంది కోవిడ్ సోకనివారు ఉన్నారని వైద్య అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. అలాగే బ్లాక్ ఫంగస్ తో ఇప్పటి వరకూ 14మంది చనిపోయారని తెలిపారు.