YSR Law Nestham : ఏపీలో యువ లాయర్లకు గుడ్ న్యూస్.. నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్

న్యాయ వాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా 100 కోట్లతో "అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్"ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

AP CM Jagan

CM Jagan : ఏపీలోని యువ లాయర్లకు గుడ్ న్యూస్. వారి ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం ఇవాళ నిధులు జమ చేయనుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వైఎస్ఆర్ లా నేస్తం పథకం కింద యువ లాయర్ల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నారు. 2వేల 807 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో దాదాపు 7 కోట్ల 98 లక్షల రూపాయలు జమకానున్నాయి. ఇవాళ అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 6వేల 69 మంది యువ లాయర్లకు ఈ నాలుగున్నరేళ్లలో అందించిన మొత్తం ఆర్థిక సాయం 49 కోట్ల 51లక్షలకు చేరనుంది.

Also Read : Today Headlines : నేటి నుంచి ఏపీలో పంటనష్టం అంచనా.. యువగళం పాదయాత్ర 3వేల కి.మీ పూర్తి

కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా ఏపీ ప్రభుత్వం మూడేళ్ల పాటు ఒక్కొక్కరికి ఏడాదికి 60వేల రూపాయలు చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఇలా మూడేళ్లపాటు మొత్తం లక్షా 80వేల రూపాయలను స్టైఫండ్‌గా అందిస్తోంది. వీటిని నెలకు 5వేల చొప్పున సంవత్సరంలో రెండు దఫాలుగా ప్రభుత్వం అందిస్తోంది. 2023-2024 సంవత్సరానికి సంబంధించి జులై నుంచి డిసెంబర్ వరకు 6 నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ. 30వేల ఆర్థిక సహాయంను ఇవాళ సీఎం జగన్ న్యాయవాదుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు. ఆర్థిక సాయంకోరే యువ లాయర్లు ఆన్ లైన్ లో mailto:sec_law@ap.gov.in ద్వారా లేదా నేరుగా లా సెక్రటరీకి దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకానికి సంబంధించిన ఏ రకమైన ఇబ్బందులున్నా 1902 ను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.

Also Read : INDIA 4th Meet: చాలా రోజుల తర్వాత ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం.. తేదీ ప్రకటించిన కాంగ్రెస్

న్యాయ వాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా 100 కోట్లతో “అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్”ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటిని న్యాయవాదుల అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, ఇతర అవసరాలకోసం ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే 25 కోట్ల ఆర్థిక సాయాన్ని వైసీపీ ప్రభుత్వం అందించింది.

 

 

 

ట్రెండింగ్ వార్తలు