Today Headlines : TSPSC ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా

ఒక్కోసారి జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని.. కేసీఆర్ తొందరలోనే కోలుకుంటారు అని చంద్రబాబు చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన చంద్రబాబు.. మళ్లీ ప్రజాసేవ చేయాలని అన్నారు.

Today Headlines : TSPSC ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా

Today Headlines in Telugu at 11PM

TSPSC ఛైర్మన్ రాజీనామా
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్ పీఎస్ సీ) ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆయన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కి పంపారు. గవర్నర్ ఆ రాజీనామా ఆమోదించి సీఎస్ కు పంపారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత జనార్దన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.

బీజేపీ సంచలన నిర్ణయం.. ముగిసిన శివరాజ్ సింగ్ చౌహాన్ శకం
మధ్యప్రదేశ్ కొత్త సీఎం ఎవరు? అన్నదానిపై వారం రోజులుగా జరుగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ను ప్రకటించింది బీజేపీ అధిష్టానం. దక్షిణ ఉజ్జయిని నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ యాదవ్ శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. సీఎం పదవి కోసం శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, బీజేపీ రాష్ట్ర చీఫ్ శర్మ, కైలాశ్ వర్గియా, జ్యోతిరాదిత్య సింథియా పోటీ పడ్డారు. చివరికి మోహన్ యాదవ్ వైపే బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపింది. సీఎంగా మోహన్ యాదవ్ ను ఎంపిక చేయడంతో.. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ శకం ముగిసినట్లు అయ్యింది.

మంగళగిరికి చిరంజీవి, గాజువాకకు గుడివాడ..!
అధికార వైసీపీలో రాజీనామాల అలజడి రేగింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే రాజీనామా చేయగా, తాజాగా గాజువాక వైసీపీ ఇంఛార్జి దేవన్ రెడ్డి రిజైన్ చేశారు. ఇంఛార్జీలు రాజీనామా చేస్తున్న చోట్ల వైసీపీ దృష్టి పెట్టింది. గాజువాక ఇంఛార్జిగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ను, మంగళగిరి ఇంఛార్జిగా గంజి చిరంజీవిని నియమించే అవకాశం కనిపిస్తోంది.

పూర్తి వివరాలతో రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం..
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. టీఎస్ పీఎస్ సీపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి.. రెండు రోజుల్లో పూర్తి వివరాలతో రావాలని టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు, నోటిఫికేషన్ల వివరాలతో రావాలని సీఎం రేవంత్ ఆదేశించారు.

కేసీఆర్ తొందరలోనే కోలుకుంటారు- చంద్రబాబు
తుంటి గాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు.. కేసీఆర్ తో మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి స్వయంగా కేసీఆర్ ని అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. అటు కేసీఆర్ కు అందుతున్న ట్రీట్ మెంట్ గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

 

  • కాసేపట్లో యశోద ఆస్పత్రికి చంద్రబాబు.. మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించనున్న టీడీపీ అధినేత…
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహువా మొయిత్రా.. లోక్‌సభ నుంచి అనైతికంగా బహిష్కరించారని పిటిషన్‌… Read More
  • వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. సెక్రటేరియట్‌లో అధికారులతో భేటీ అయిన సీఎం
  • హీటెక్కిన బెజవాడ పాలిటిక్స్‌.. టీడీపీ పశ్చిమ టికెట్‌ తనదే అంటున్న జలీల్‌ ఖాన్‌
  • నాదెండ్ల అరెస్ట్‌పై స్పందించిన పవన్ కల్యాణ్.. మనోహర్‌ను విడుదల చేయకపోతే విశాఖకు వస్తానన్న పవన్..
  • కాసేపట్లో సీఎం జగన్‌తో గంజి చిరంజీవీ భేటీ.. మంగళగిరి ఇంచార్జిగా ప్రకటించే అవకాశం…
  • ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రేణుకా చౌదరి.. ఉచిత బస్సు పథకాన్ని మహిళలకు వివరించిన మాజీ మంత్రి..
  • మరికాసేపట్లో ఢిల్లీకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి…ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న మంత్రి..
  • ఆర్టికల్ 370 రద్దు సబబేనన్న సుప్రీం…..జమ్మూకశ్మీర్‌, లద్ధాఖ్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి ఆదేశం…
  • రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు నెతన్యాహు ఫోన్…ఇరాన్ సహకారంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఇజ్రాయెల్ ప్రధాని..

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక కోసం అసెంబ్లీ సచివాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైనట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. డిసెంబర్ 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 14న అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరుగనుంది. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ స్పీకర్ ను ఎన్నికను నిర్వహించనున్నారు. స్పీకర్ పదవికి ఇదివరకు గడ్డ ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. అయితే ఈ పదవికి బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది.

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం : ప్రధాని మోదీ
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం అని ప్రధాని మోదీ అన్నారు. ఆర్టికల్ 370పై భారత పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమైందని సుప్రీంకోర్టు సమర్థించిందన్నారు.

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : అమిత్ షా
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రధాని దూరదృష్టితో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

టార్గెట్ వైసీపీ..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువత నేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర యువత భవిష్యత్తు కోసమేనని టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వ మోసాలను నిలదీస్తామని తెలిపారు.

జానారెడ్డితో రేవంత్ భేటీ ..
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంను జానారెడ్డి వాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు గంటసేపు వీరిద్దరూ వివిధ అంశాలపై చర్చించుకున్నారు.

ఆళ్ల రాజీనామా..
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పూర్తి వివరాలు 

ఆర్టికల్ 370పై  సుప్రీంకోర్టు తీర్పు..
జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్దమేనని సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ నిబంధన తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని తెలిపింది. వీలైనంత త్వరగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలు..

సభాస్థలి ఖరారు..
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభాస్థలి ఖరారైంది. భోగాపురం పోలిపల్లిలో లోకేశ్ పాదయాత్ర ముగింపు సభ ఉంటుందని, సభ ప్రాంగణం వద్ద ఇవాళ ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు భూమిపూజ చేస్తారని టీడీపీ నేతలు తెలిపారు.

ఏపీకి తుఫాన్ గండం..
ఏపీకి మరో తుఫాన్ గండం పొంచిఉంది. ఈనెల 16న బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఉపరితల ఆవర్తనం.. ఈనెల 18న అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈనెల 21 నుంచి 25 వరకు ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనావేసింది.

కారులో మంటలు..
సిద్ధిపేట జిల్లాలోని గౌరారం శివారులో కారులో మంటలు చెలరేగాయి. చెట్టును ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.

ప్రభుత్వం కుప్పకూలిపోవచ్చేమో..
జేడీఎస్‌ అగ్రనేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సంచలన కామెంట్స్‌ చేశారు. కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం కూలిపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ కీలక మంత్రి బీజేపీలో చేరే చాన్స్‌ ఉందన్నారు. కేంద్రం పెట్టిన కేసుల నుంచి బయటపడేందుకు ఓ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ మంత్రితోపాటు 50 నుంచి 60మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతారని.. ప్రస్తుతం బీజేపీ హైకమాండ్‌తో చర్చలు జరుపుతున్నారంటూ బాంబు పేల్చారు. కుమారస్వామి వ్యాఖ్యలు కర్ణాటక పాలిటిక్స్‌లో కలకలం రేపుతున్నాయి.

క్యాబినెట్ సమావేశం ..
ఈనెల 14న ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది.

పుతిన్ తో మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని ..
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం, ఆ ప్రాంతంలో పరిస్థితిని ప్రస్తావించారు. సుమారు 50 నిమిషాలపాటు వీరిద్దరి మధ్య ఫోన్‌ సంభాషణ జరిగింది.

ఏపీకి తెలంగాణ సీఎం..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ఏపీకి వెళ్లనున్నారు. కుటుంబంతో సహా దుర్గమ్మను దర్శించుకోనున్నారు.

ఏజెన్సీపై చలి పులి పంజా ..
తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరుగుతోంది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌ మండలంలో నిన్న ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. ఇక్కడ అత్యల్పంగా 10.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక తిర్యాణి మండలం గిన్నెధరిలో 11.7 , ఆసిఫాబాద్‌ మండలంలో 12.2, కెరమెరి మండలంలో 12.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్‌ జిల్లాలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 13.7 డిగ్రీలకు చేరింది.

రాజస్థాన్ సీఎం పీఠంపై ఉత్కంఠ..
రాజస్థాన్ సీఎం పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అయితే ఫలితాలు వెల్లడై వారంరోజులు గడిచినా సీఎం ఎవరన్నది బీజేపీ అధిష్టానం ఇంకా తేల్చలేదు. ఆ పార్టీ విజయం తర్వాత బాబా బాలక్ నాథ్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఎంపీ పదవికి రాజీనామా చేసిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, దియా కుమారి కూడా సీఎం రేస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

నేటి నుంచి పంట నష్టంపై అంచనాలు ..
మిగ్‌జామ్‌ తుపాన్‌ వల్ల ఏర్పడిన పంటనష్టాన్ని అంచనా వేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. ఇవాళ్టి నుంచి తుపాను నష్టం అంచనా వేయనుంది. ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నాయి. ఈనెల 18 నుంచి ఆర్బీకేల్లో సామాజిక తనిఖీలు చేయనున్నారు. 25న లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయనున్నారు అధికారులు. ఈ నెల 31న తుది జాబితా ప్రకటిస్తారు. సంక్రాంతి పండుగలోపు రైతులకు నష్టపరిహారాన్ని వాళ్ల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది.

నేడే కీలక తీర్పు..
జమ్మూకశ్వీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దు అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కశ్మీర్ లో అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది.

యువగళం పాదయాత్ర ..
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ యాత్ర తుని మండలం తేటగుంట వద్ద 3వేల కిలోమీటర్లు మైలురాయిని అధిగమించింది. యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేశ్ 219 రోజుల్లో 3006 కిలో మీటర్లు నడిచారు. ఇవాళ తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద పైలాన్ ఆవిష్కరణ చేయనున్నారు.

అప్పటి వరకు రేవంతే ..
తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో.. టీపీసీసీ చీఫ్‌గా ఎవరిని నియమిస్తారన్న చర్చ జోరందుకుంది. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు. దీంతో పీసీసీ చీఫ్‌ను మారుస్తారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. దీంతో కొత్త పీసీసీ చీఫ్‌ ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే, 2021 జూన్ 26న పీసీసీ అధ్యక్ష బాధ్యత‌లు చేప‌ట్టిన రేవంత్ రెడ్డి.. పార్లమెంట్ ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు అంటే మ‌రో 6నెల‌లు ఈ పదవిలో కొన‌సాగే అవ‌కాశం ఉంది.

నేడు వైఎస్‌ఆర్‌ లా నేస్తం నిధులు ..
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ వైఎస్‌ఆర్‌ లా నేస్తం నిధులు విడుదలకానున్నాయి. తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీస్‌లో సీఎం జగన్‌ బటన్‌నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. 2వేల 807 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో దాదాపు 7 కోట్ల 98 లక్షల రూపాయలను సీఎం జగన్ జమ చేయనున్నారు.