Mahua Moitra : లోక్‌సభ సభ్యత్వం రద్దును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన మహువా మొయిత్రా

క్యాష్ ఫర్ క్వెరీ కేసుకు సంబంధించి లోక్‌సభ ఎంపీగా బహిష్కరించబడిన కొన్ని రోజుల తర్వాత మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను లోక్ సభ నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని పిటిషన్‌లో మొయిత్రా పేర్కొన్నారు.

Mahua Moitra : లోక్‌సభ సభ్యత్వం రద్దును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన మహువా మొయిత్రా

TMC Leader Mahua Moitra

TMC Leader Mahua Moitra : తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకురాలు మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వం రద్దు అయిన విషయం తెలిసిందే. తనను లోక్‌సభ ఎంపీగా బహిష్కరించడాన్ని సవాలు చేస్తూ మహువా మొయిత్రా సుప్రీంకోర్టుకు వెళ్లారు. క్యాష్ ఫర్ క్వెరీ కేసులో లోక్‌సభ ఎంపీగా బహిష్కరించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

క్యాష్ ఫర్ క్వెరీ కేసుకు సంబంధించి లోక్‌సభ ఎంపీగా బహిష్కరించబడిన కొన్ని రోజుల తర్వాత మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను లోక్ సభ నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని పిటిషన్‌లో మొయిత్రా పేర్కొన్నారు. డిసెంబర్ 8న క్యాష్ ఫర్ క్వెరీ కేసులో మొయిత్రాను దోషిగా నిర్ధారించిన ఎథిక్స్ కమిటీ నివేదికను సభ ఆమోదించిన తర్వాత ఆమెను లోక్‌సభ నుండి బహిష్కరించారు.

Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం

మొయిత్రాను లోక్‌సభ నుండి బహిష్కరించడాన్ని టీఎంసీ నేత తీవ్రంగా ఖండించారు. బహిష్కరణ తరువాత ఎథిక్స్ ప్యానెల్‌ను మొయిత్రా తప్పుబట్టారు. ఇది ప్రతిపక్షాన్ని బుల్‌డోజ్ చేయడానికి ఆయుధంగా మారిందని అన్నారు. ఎథిక్స్ కమిటీ, దాని నివేదిక నిబంధనలను ఉల్లంఘించిందని ఆమె ఆరోపించారు.

డిసెంబర్ 8న మొహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వం రద్దు అయింది. నైతిక విలువల కమిటీ నివేదికకు లోక్ సభ ఆమోదం తెలిపింది. నైతిక విలువల కమిటీ నివేదికతో లోక్ సభ మొహువా మొయిత్రా సభ్యత్వం రద్దు చేసింది. డబ్బులు తీసుకుని పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగారని మహువా మొయిత్రాపై ఆరోపణలు వచ్చాయి. ఎథిక్స్ కమిటీ నివేదికతో మెయిత్రాపై చర్యలు తీసుకుంది.

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

మొహువా మొయిత్రా లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. డబ్బులు తీసుకుని పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగారని మొహువా మొయిత్రాపై ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ లోక్ సభలో నివేదికతో మెయిత్రాపై చర్యలు తీసుకుంది. మొహువాను లోక్ సభలో చర్చల్లో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదు.

దీంతో ఆమె లోక్ సభ బయటికి వచ్చి మాట్లాడారు. ఎథిక్స్ కమిటీ నిబంధనలను ఉల్లంఘించిందని ఆమె పేర్కొన్నారు. ఎంపీ మొహువా మొయిత్రాను బహిష్కరిస్తూ లోక్ సభ తీర్మానించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షా సభ్యులు వాకౌట్ చేశారు. మహువా మొయిత్రా లోక్‌స‌భ సభ్యత్వం రద్దు చేయడాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. లోక్‌స‌భ నుంచి వాకౌట్ చేసి పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపాయి.

Alla Ramakrishna Reddy : వైసీపీకి బిగ్ షాక్ : ఎమ్మెల్యే పదవి, వైసీపీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా

కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత ఫరూక్ అబ్దుల్లా తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా పగ సాధించేందుకే చర్యలు తీసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.