Pawan Kalyan : వాళ్లపై చర్యలు తీసుకోండి.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Pawan Kalyan : వాళ్లపై చర్యలు తీసుకోండి.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan

Updated On : December 12, 2025 / 1:49 PM IST

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉల్లంఘనలకు పాల్పడుతూ తన ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేసే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో పవన్ కల్యాణ్ కోరారు.

Also Read: Gold and Silver Rates : మరోసారి దిమ్మదిరిగే షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. 2026లో ఇక దబిడిదిబిడే..

పవన్ వ్యక్తిగత ప్రతిష్ఠ, హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలుగా పలు పోస్టులు వైరల్ అవుతున్నాయని.. వాటిపై చర్యలు తీసుకోవాలని ఆయన తరపున న్యాయవాది న్యాస్థానాన్ని కోరారు. పిటిషన్ పై విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ఆ లింక్‌లను ఏడు రోజుల లోపు తొలగించాలని ఆదేశించింది. ఇదే సమయంలో తాను తొలగించాలని కోరుకుంటున్న యూఆర్ఎల్స్ ను సోషల్ మీడియా సంస్థలకు అందించాలని పవన్ తరపున న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. అందుకు 48గంటల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 22వ తేదీకి వాయిదా వేసింది.

ఇప్పటికే బాలీవుడ్ సినీ ప్రముఖులతోపాటు.. టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని కోరుతూ కోర్టును ఆశ్రయించి రక్షణ పొందిన విషయం తెలిసిందే.. వారి బాటలోనే తాజాగా.. పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.