Gold and Silver Rates : మరోసారి దిమ్మదిరిగే షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. 2026లో ఇక దబిడిదిబిడే..
Gold and Silver Rates : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్..
Gold and Silver Rates
Gold and Silver Rates : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్. గోల్డ్, సిల్వర్ ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. రెండురోజులుగా జెట్ స్పీడ్ తో ధరలు దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా.. దేశంలోనూ గోల్డ్, వెండి సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేని స్థాయికి చేరుకున్నాయి.
Also Read: IND vs SA T20 Match : మేం చేసిన పెద్ద తప్పు ఇదే.. అందుకే ఓడాం.. కెప్టెన్ సూర్యకుమార్ కీలక కామెంట్స్
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.1910 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.1750 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 15డాలర్లు తగ్గింది. అక్కడ ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 4,267 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మరోవైపు.. వెండి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఊహకందని స్థాయికి సిల్వర్ ధరలు చేరిపోయాయి. గత ఐదు రోజులుగా వెండి ధరలు భారీగా పెరుగుతోంది. శుక్రవారం కూడా వెండి రేటు పెరిగింది. కిలో వెండిపై రూ.6వేలు పెరిగింది. గడిచిన ఐదు రోజుల్లో కిలో వెండిపై రూ.20వేలు పెరిగింది.
నిపుణుల అంచనాల ప్రకారం.. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వీటి ధరలు భారీగా పెరిగే చాన్స్ ఉందని పేర్కొంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.1,21,750 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,32,810కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,21,750 కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,32,810కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,21,750 కాగా.. 24క్యారట్ల ధర రూ.1,32,810కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ.6వేలు పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.2,15,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,07,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 2,15,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
