CM Jagan : చెదరని చిరునవ్వు, పోరాడే గుణం, మాట తప్పని నైజం.. ఇవన్నీ నువ్వు నేర్పినవే నాన్నా
నేడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. ఈ సందర్భంగా సీఎం జగన్ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
- Naveen
- Published On : July 8, 2021 / 01:43 PM IST
Cm Jagan
CM Jagan : నేడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. ఈ సందర్భంగా సీఎం జగన్ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం.. పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం.. మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం.. నీ ఆశయాలే నాకు వారసత్వం.. ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా.. పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా.. జన్మదిన శుభాకాంక్షలు నాన్నా’ అని జగన్ ట్వీట్ చేశారు. వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్‌లో జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.
మంత్రులు, వైసీపీ నేతలు వైఎస్ ను గుర్తు చేసుకున్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. దేశంలో సంక్షేమ విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి వైఎస్సార్ అని, తండ్రి బాటలోనే సీఎం జగన్ పయనిస్తున్నారని చెప్పారు. రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని, తొలి నుంచి తాము ఆయనతో అడుగులు వేసిన వాళ్లమేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
వైఎస్ జయంతిని పురస్కరించుకుని సీనియర్ నటుడు మోహన్ బాబు ట్విట్టర్‌లో స్పందించారు. ‘స్నేహశీలి, రాజఠీవి, రాజకీయ దురంధరుడు, మాట తప్పడు మడమ తిప్పడు అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం, పేద ప్రజల దైవం మా బావగారైన వైఎస్ పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మశాంతి కలగాలని ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకి ఉండాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం
పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం
మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం
నీ ఆశయాలే నాకు వారసత్వం
ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా…
పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా..
జన్మదిన శుభాకాంక్షలు నాన్నా.#YSRJayanthi— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2021
స్నేహశీలీ, రాజఠీవి, రాజకీయ దురంధరుడు, మాట తప్పడు మడమ తిప్పడు అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం,పేద ప్రజల దైవం మా బావగారైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మశాంతి కలగాలని ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకి ఉండాలని కోరుకుంటున్నాను. pic.twitter.com/ltfHHWrlYd
— Mohan Babu M (@themohanbabu) July 8, 2021
