AP CM YS Jagan Mohan Reddy:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమంలో భాగంగా ఇప్పటికే ఇళ్ల పట్టాలు కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్.. ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ అనే పథకంలో భాగంగా జగన్.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ఉదయం 9గంటల 30నిమిషాలకు తాడేపల్లి నుంచి చిత్తూరు జిల్లాకు బయలుదేరతారు. 11గంటల 20నిమిషాలకి ఊరందూరు చేరుకొని పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తారు. ఇదే సమయంలో YSR జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహిస్తారు. తర్వాత అక్కడే జరిగే సభలో ప్రసంగం చేస్తారు.
మధ్యాహ్నం 2గంటల 50నిమిషాలకు తాడేపల్లి చేరుకుంటారు. ఊరందూరులో YSR జగనన్న కాలనీలో 167 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో 6,232 ప్లాట్లు వేయగా.. వీటిలో 4,299 ప్లాట్లను పట్టణ పేదలకు, 465ప్లాట్లను శ్రీకాళహస్తి రూరల్ వారికి.. 1,468 ప్లాట్లు ఏర్పేడు రూరల్ ప్రాంతాలకు చెందిన పేదలకు కేటాయించారు.
తొలివిడతలో భాగంగా 5,548 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనుండగా.. కాలనీని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు 8,600 మొక్కలను ఇప్పటికే అక్కడ నాటారు.