Ys Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఐదు రోజుల పాటు సతీ సమేతంగా పారిస్ పర్యటనకు వెళుతున్నారు. రేపు రాత్రి గం.7-30 లకు తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పారిస్ కు బయలుదేరి వెళతారు.
29వ తేదీ ఉదయం పారిస్ కు చేరుకున్న జగన్ దంపతులు… జూలై 2న పెద్ద కుమార్తె హర్ష చదువుతున్న యూనివర్సిటీ లో జరిగే కాన్వొకేషన్ లో పాల్గొంటారు. జగన్ కుమార్తె వైఎస్ హర్షా రెడ్డి ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ ఇన్సీడ్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తిరిగి జగన్ దంపతులు జూలై 3న తాడేపల్లి చేరుకుంటారు.
ఫ్రాన్స్ రాజధాని పారిస్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ జగన్ ఇటీవలే పిటిషన్ దాఖలు చేయగా… నాంపల్లిలోని సీబీఐ కోర్టు అందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 28 నుంచి 10 రోజుల పాటు పారిస్‌లో పర్యటించేందుకు జగన్‌కు కోర్టు అనుమతించింది.
Also Read :Narendra Modi : ప్రధానమంత్రి మోదీ ఏపీ పర్యటన ఖరారు