AP Coronavirus Cases Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు కొన్నిరోజులుగా పదివేలకు తగ్గడం లేదు.. ప్రతిరోజు 10వేలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో వెయ్యికు మించి పోయాయి కరోనా కేసులు. ఇక రికవరీ కేసులు అయితే కరోనా కేసులతో సమంగా నమోదయ్యాయి.. ఏపీలో గత 24 గంటల్లో నిర్వహించిన ర్యాపిడ్ టెస్టుల్లో 59,834 మందికి కరోనా పరీక్షలు చేశారు.
వీరిలో 10, 368 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కోవిడ్ సోకి మరణించినవారిలో చిత్తూరులో 14 మంది, పశ్చిమ గోదావరిలో 11 మంది, తూర్పు గోదావరిలో 10 మంది, అనంతపూర్‌లో ఏడుగురు, గుంటూరులో ఏడుగురు, విశాఖపట్నంలో ఏడుగురు, నెల్లూరులో ఆరుగురు, కడపలో ఐదుగురు, కృష్ణలో నలుగురు, కర్నూల్ లో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, ప్రకాశంలో 3 మంది, విజయనగరంలో ఇద్దరు మరణించారు.
గడిచిన 24 గంటల్లో 9,350 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 37,82, 746 శాంపిల్స్ సేకరించి కరోనా టెస్టులు నిర్వహించారు.