AP Covid Cases Live Updates : ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కొన్ని రోజులుగా వరుసగా పదివేలకు పైగా కరోనా కేసులు మోదవుతున్నాయి. ఏపీలో గత 24 గంటల్లో 56,490 శాంపిల్స్ పరీక్షించగా 10,004 కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ఏపీ ఆరోగ్యశాఖ ప్రకటించింది.
గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 85 మంది మృతి చెందారు. కరోనాతో ఇప్పటి వరకు 3,969 మంది మృతి చెందారు. ఈ రోజు (సోమవారం) నమోదైన కేసులతో కలిపి ఏపీలో 4 లక్షల 34 వేల 771కి కరోనా కేసులు చేరాయి. ప్రస్తుతం ఏపీలో 1,00,276 యాక్టివ్ కేసులునట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.
కోవిడ్ వల్ల నెల్లూరులో 12 మంది, చిత్తూరులో తొమ్మిది మంది, ప్రకాశంలో తొమ్మిది మంది, కడపలో 8 మంది, అనంతపూర్‌లో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఏడుగురు, గుంటూరులో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఏడుగురు మరణించారు.
కర్నూలులో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణలో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు మరణించారు. గడిచిన 24 గంటల్లో 8,772 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 37,22,912 శాంపిల్స్ పరీక్షించారు.