Andhra Pradesh: ఏపీ సీఎస్ సమీర్ శర్మకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ఏపీ సీఎస్ సమీర్ శర్మ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తుంగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు ఆయనను ఆస్పత్రికి తరలించారు.
- Narender Thiru
- Updated on- November 3, 2022 / 04:33 PM IST
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఏపీ సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తుండగా, ఒక్కసారిగా అస్వస్థతకు గరుయ్యారు. సమావేశం నిర్వహిస్తుండగా ఒక పక్కకు ఒరిగిపోయారు. దీంతో వెంటనే అధికారులు ఆయను ఆస్పత్రికి తరలించారు.
Bridegroom: అత్తింటివారు ఇచ్చిన కారుతో అత్తను ఢీకొట్టి చంపిన అల్లుడు
స్థానిక మణిపాల్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఇటీవలే సమీర్ శర్మ అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆయనకు గుండెకు శస్త్రచికిత్స నిర్వహించారు. తర్వాత కోలుకున్న ఆయన తిరిగి, విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో గురువారం మరోసారి అస్వస్థతకు గురయ్యారు.
