AP Curfew Relaxations : ఏపీలో కర్ఫ్యూ సడలింపులు… ఏయే వేళల్లో మార్పులంటే?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జూన్ 11 నుంచి కర్ఫ్యూను సడలించనున్నారు. కర్ఫ్యూ రిలాక్సేషన్ సమయాన్ని మరింత పెంచింది ఏపీ సర్కార్.. రిలాక్సేషన్ సమయాన్ని మరో రెండు గంటల పాటు పొడిగించింది.

AP Curfew Relaxations : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జూన్ 11 (శుక్రవారం) నుంచి కర్ఫ్యూను సడలించనున్నారు. కర్ఫ్యూ రిలాక్సేషన్ సమయాన్ని మరింత పెంచింది ఏపీ సర్కార్.. జూన్ 10 వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు అమల్లో ఉండగా.. జూన్ 11 నుంచి రిలాక్సేషన్ సమయాన్ని మరో రెండు గంటల పాటు పొడిగించింది. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ వెసులుబాటు అమల్లో ఉండనుంది.

ఈ నిబంధనలు జూన్ 20వ తేదీ వరకు అమలులో ఉంటాయని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అనిల్ సింఘాల్ పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నట్లు తెలిపారు. రెండు గంటల తర్వాత నుంచి కర్ఫ్యూ కఠినంగా అమలు చేయాల్సిందిగా కలెక్టర్లు, ఎస్పీలను ఆయన ఆదేశించారు.

మరోవైపు ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 97,863 శాంపిల్స్‌ పరీక్షించారు.. అందులో 8,110 మంది కరోనా పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 17,87,883 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఏపీలో 99,057 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 12,981 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 16,77,063కి చేరింది.

ట్రెండింగ్ వార్తలు