AP Deputy CM Pawan Kalyan
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘‘ఉత్తరాదినున్న హిమాలయాలలో ‘పరమశివుని’ కైలాసం ఉంది. దక్షిణాదిన ఆయన కుమారుడు ‘మురుగన్’ నివాసముంది.. వారు వెలిసిన ప్రదేశం ఈ ‘’భారత దేశం’.. ఇది జగన్మాత ఆదేశం’’ అని పవన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం జనసేనాని ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారని మాట్లాడుతున్నారు.. తమిళ సినిమాల్ని హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. దీనిపై డీఎంకే శ్రేణులతో పాటు నటుడు ప్రకాష్ రాజ్ సైతం పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
ఉత్తరాదినున్న హిమాలయాలలో ఉంది ‘పరమశివుని’ కైలాసం
దక్షిణాది ఆయన కుమారుడు ‘మురుగన్’ నివాసం
వారు వెలిసిన ప్రదేశం ఈ ‘’భారత దేశం’
ఇది జగన్మాత ఆదేశం …— Pawan Kalyan (@PawanKalyan) March 15, 2025
Read Also : Vijayasai Reddy : కోటరీ వదలదు, కోట కూడా మిగలదు.. జరిగేది ఇదే.. విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్..!
జనసైనికులు కూడా అంతే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ వివరణ ఇచ్చారు. తాను ఎప్పుడూ హిందీని ఒక భాషగా వ్యతిరేకించలేదన్నారు. ఆ భాష తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకించినట్టు చెప్పారు.