AP Govt : ఏపీలోని ఎస్సీ, ఎస్టీలకు శుభవార్త.. వారంరోజుల్లో ఆ డబ్బు అకౌంట్లోకి.. అసెంబ్లీ సాక్షిగా ప్రకటన
AP Govt : ఏపీలోని ఎస్సీ, ఎస్టీలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు పోత్సాహకాలు రానివారికి వారంరోజుల్లో ఆ సోమ్మును వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని అసెంబ్లీ వేదికగా మంత్రి టీజీ భరత్ ప్రకటించారు.
TG Bharat
- ఏపీలోని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు శుభవార్త
- వారంరోజుల్లో వారి ఖాతాల్లోకి నగదు
- అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి టీజీ భరత్
AP Govt : ఏపీలోని ఎస్సీ, ఎస్టీలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు పోత్సాహకాలు రానివారికి వారంరోజుల్లో ఆ సోమ్మును వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని అసెంబ్లీ వేదికగా మంత్రి టీజీ భరత్ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు అవకాశాలు, ప్రోత్సాహకాలపై ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ సమాధానం ఇచ్చారు.
Also Read : Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వానలేవానలు.. వారికి వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు
మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. 2019 – 24 మధ్య అయిదేళ్లలో ఎస్సీఎస్టీలకు 1,005 ఎకరాల ల్యాండ్ కేటాయించారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 751 ఎకరాలను ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు కేటాయింపులు చేయడం జరిగిందని తెలిపారు. డీపీఆర్ ప్రకారం.. 751 ప్రాంతాల్లో రూ. 1,274 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు. వీటి ద్వారా 17వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని అన్నారు. వారికి ల్యాండ్‌కు సంబంధించి 37కోట్లు రిబేటు ఇచ్చామని మంత్రి తెలిపారు.
అన్ని క్యాటగిరీలలో ఎస్సీ ఎస్టీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీఎస్టీలకు ఎలాంటి పెనాల్టీ లేకుండా టైం పెంచామని అన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో 217కోట్లు ఇవ్వడంతో పాటు 2000 కోట్లు ఇన్సెంటివ్‌లు ఇచ్చామని మంత్రి భరత్ తెలిపారు.
ఇన్సెంటివ్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఎస్క్రో ఎకౌంట్ తేవడంతోపాటు వారి ఎకౌంట్లో డైరెక్టుగా రిప్లెక్ట్ అయ్యేలా ప్లాన్ చేశామని అన్నారు. మెటరింగ్ విషయంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వద్ద ప్రోత్సాహకం వారికి లభిస్తుదని, టెండరింగ్‌కు సంబంధించి పర్సెంటేజ్ రిజర్వేషన్ అడిగారని అన్నారు. ఇప్పటికే 4శాతం రిజర్వేషన్ ఉందని తెలిపారు.
100 కోట్లు కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి 5000 ఎంఎస్ఎంఈలకు సహకరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్విజర్లాండ్లో ఉన్నప్పుడే ఆదేశాలు ఇచ్చారని, ఎస్సీఎస్టీ పారిశ్రామిక వేత్తలకు పోత్సాహకాలు రానివారికి వారం రోజుల్లో ఆ సోమ్ముకూడా వారికి అందుతుందని మంత్రి తెలిపారు.
