School Holidays: ఏపీ విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్.. రేపటినుంచి దసరా సెలవులు.. విద్యాశాఖ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యార్థులకు దసరా పండుగ సందర్భంగా భారీ స్థాయిలో వరుస సెలవులు (School Holidays)రాబోతున్నాయి.

AP Education Department has announced the Dasara holidays.

School Holidays: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యార్థులకు దసరా పండుగ సందర్భంగా భారీ స్థాయిలో వరుస సెలవులు(School Holidays) రాబోతున్నాయి. పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన 2026-27 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అధికారిక దసరా సెలవులు అక్టోబర్ 12 నుంచి 21 వరకు నిర్ణయించారు. అయితే అక్టోబర్ 10 రెండో శనివారం, అక్టోబర్ 11 ఆదివారం కావడంతో ఈ శని, ఆదివారాల సెలవులు కూడా దసరా పండగ సెలవులకు తోడయ్యాయి. దీంతో విద్యార్థులకు అక్టోబర్ 10వ తేదీ నుంచే పాఠశాల సెలవులు ప్రారంభమై, అక్టోబర్ 21వ తేదీ వరకు నాన్‌స్టాప్‌గా కొనసాగనున్నాయి.

AP Government: జగనన్న కాలనీల లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. నచ్చకపోతే స్థలాలు క్యాన్సిల్.. కూటమి సర్కార్ సంచలన నిర్ణయం!

అక్టోబర్ 22న స్కూళ్లు పునఃప్రారంభం.. రేపు మధ్యాహ్నం నుంచే హాస్టళ్లు ఖాళీ:

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ వచ్చిన ఈ సుదీర్ఘ సెలవులతో విద్యార్థులు, తల్లిదండ్రులు తమ పండుగ ప్రయాణాలు, ట్రిప్‌లను ముందస్తుగా ప్లాన్ చేసుకుంటున్నారు. దసరా పండుగ సెలవులు ముగిసిన అనంతరం అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం స్కూళ్లలో కొనసాగుతున్న ఫార్మేటివ్-2 పరీక్షలు నేటితో (అక్టోబర్ 8) ముగియనుండటంతో, శుక్రవారం (అక్టోబర్ 9) మధ్యాహ్నం నుంచే విద్యార్థులు ఇళ్లకు పయనం కానున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రత్యేక సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చాయి.

మొత్తం 87 సెలవులు, 229 పనిదినాలు.. ఉపాధ్యాయుల కీలక సూచనలు:

పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులకు మొత్తం 87 సెలవులు రానుండగా, 229 రోజులు పాఠశాల పనిదినాలుగా ఉండనున్నాయి. కేవలం దసరా మాత్రమే కాకుండా రాబోయే క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు కూడా ప్రత్యేకంగా సెలవుల షెడ్యూల్‌ను అధికారులు పొందుపరిచారు. దసరా వేడుకల ఆనందంలో మునిగితేలుతూనే, ఈ సుదీర్ఘ సెలవులను కేవలం వినోదానికే పరిమితం చేయకుండా పెండింగ్‌లో ఉన్న పాఠ్యాంశాలను పూర్తి చేసుకోవడానికి మరియు రాబోయే పరీక్షలకు సిద్ధం కావడానికి ఉపయోగించుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.