AP Budget 2024 : బ‌డ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం.. వెల్లడించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

అసెంబ్లీలో ఉదయం ఏపీ క్యాబినెట్ ప్రత్యేకంగా సమావేశమై ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ..

AP-Budget-2024

Buggana Rajendranath : ఏపీ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో సుమారు 3లక్షల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వారంరోజులుగా అధికారులతో కసరత్తు చేసి ఓ రూపు ఇచ్చారు. ఉదయం 10.30గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ను బుగ్గన సమర్పించనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టటానికి ముందు సెక్రటేరియట్ లో క్యాబినెట్ ప్రత్యేకంగా సమావేశమై ఆమోదం తెలిపింది. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పటికీ మూడునాలుగు నెలల అవసరాలకు మాత్రమే అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

Also Read : చెక్కులు ఇచ్చిన ప్రముఖలపై పవన్ కల్యాణ్ సీరియస్.. ఎందుకో తెలుసా

ఉదయం 8.30గంటలకు ఏపీ క్యాబినెట్ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశమైంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతకుముందు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. 2024- 25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల ఆనందంకోసం మా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి నాలుగు నెలల కాలానికి ఆమోదం తెలుపుతామని చెప్పారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే దీనికి నిరదర్శనమని బుగ్గన తెలిపారు.

Also Read : చంద్రబాబులా అబద్ధాలు చెప్పడం నాకు చేతకాదు, అఖండ మెజార్టీతో మళ్లీ మేమే వస్తాం- సీఎం జగన్

ఆర్థిక పరిస్థితి బాగుంటే, కోవిడ్ లేకపోయి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసేవాళ్లం అని అన్నారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం హయాంలో చేయాల్సిన దానికన్నా అట్టడగు వర్గాలకు ఎక్కువ మేలు చేశామని, ప్రభుత్వం లేకపోతే బతకడం కష్టంగా ఉన్న, నిస్సహాయ పేద వర్గాలే మా ప్రాధాన్యత అని బుగ్గన పేర్కొన్నారు. గత ఐదేళ్లలో బడ్జెట్ లో విద్య, వైద్యం, మహిళా సాధికారత, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశామని చెప్పారు. మరోవైపు శాసనమండలిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు