AP BC Reservation: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సుప్రీంకోర్టు వెళ్లిన సర్కార్.. తీర్పుపై తీవ్ర ఉత్కంఠ!

స్థానిక సంస్థల ఎన్నికల్లో BC(AP BC Reservation) లకు 34 శాతం రిజర్వేషన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

AP government approaches Supreme Court regarding BC reservation in local body elections.

AP BC Reservation: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (BC) 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీసీలకు 34% రిజర్వేషన్లు పునరుద్ధరించడానికి తమ ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడంతో, అధికారుల బృందం ఢిల్లీలో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను (SLP) దాఖలు చేసింది.

Ap Teacher Local Cadre: ఏపీ టీచర్లకు బిగ్ అప్‌డేట్.. స్థానికతను ఖరారు చేస్తూ జివోలు జారీ.. 1.70 లక్షల మందికి లబ్ధి!

50 శాతం పరిమితి దాటిందన్న హైకోర్టు.. విచారణపై సస్పెన్స్:

మొత్తం రిజర్వేషన్లు(AP BC Reservation) 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు గత తీర్పులను ఉటంకిస్తూ హైకోర్టు ఈ జీవోలను రద్దు చేయడమే కాకుండా, ఆరు వారాల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే, బీసీల రాజకీయ, సామాజిక పురోగతికి 34 శాతం రిజర్వేషన్లు అత్యంత కీలకమని వాదిస్తున్న ప్రభుత్వం, సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు తమ బలమైన వాదనలను వినిపించేందుకు సమాయత్తమవుతోంది.