Ap Teacher Local Cadre: ఏపీ టీచర్లకు బిగ్ అప్డేట్.. స్థానికతను ఖరారు చేస్తూ జివోలు జారీ.. 1.70 లక్షల మందికి లబ్ధి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయుల (Ap Teacher Local Cadre)స్థానికత వివాదానికి తెరదించుతూ ఏపీ ప్రభుత్వం కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది.
AP government issued G.O.s 201 and 202 regarding the local status of teachers.
Ap Teacher Local Cadre: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయుల స్థానికత వివాదానికి తెరదించుతూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం అత్యంత కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. నూతన రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 కింద సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, వారికి సమానమైన కేడర్ కలిగిన ఉపాధ్యాయులందరినీ జిల్లా కేడర్ ఉద్యోగులుగా ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్వీసు విషయాలు, బదిలీలు, పదోన్నతుల్లో ఎదురవుతున్న పలు సందేహాలను నివారించేలా సీఎస్ సాయి ప్రసాద్ ఈ అధికారిక ఉత్తర్వులను విడుదల చేశారు.
AP Rains: బంగాళాఖాతంలో భారీ వాయుగుండం.. ఏపీకి మళ్లీ తుఫాను ముప్పు? వాతావరణ శాఖ హెచ్చరికలు!
201, 202 జీవోల విడుదల.. ఎంపీపీ, జడ్పీ, ప్రభుత్వ పాఠశాలలకు వేర్వేరుగా ఆదేశాలు:
ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న 27 రకాల టీచర్లను(Ap Teacher Local Cadre) జిల్లా కేడర్‌గా నిర్ధారిస్తూ విద్యాశాఖ 201 జీవోను విడుదల చేసింది. అదేవిధంగా మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో విధుల్లో ఉన్న 23 రకాల కేడర్ల టీచర్లను జిల్లా కేడర్‌లోకి తెస్తూ 202 జీవోను జారీ చేసింది. అయితే, ప్రభుత్వ, ఎంపీపీ, జడ్పీ పాఠశాలల్లో పనిచేసే గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-2 పోస్టులను మాత్రం జోనల్ కేడర్‌గా ప్రభుత్వం వర్గీకరించింది.
దాదాపు 1.70 లక్షల మంది టీచర్లకు లబ్ధి.. స్పష్టత వచ్చిన లోకల్ కేడర్:
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 70 వేల మంది స్కూల్ అసిస్టెంట్లు, సుమారు లక్ష మంది వరకు ఉన్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల స్థానికత విధానంపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. తాజా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఉద్యోగుల కేడర్లను ఖరారు చేయడంతో ఉపాధ్యాయ సంఘాలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
