AP Govt Jobs: ఏపీలోని మహిళలకు శుభవార్త.. 913 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ఆమోదం.. జిల్లాల వారిగా పోస్టులు.. అర్హతలివే..
AP Asha Workers Vacancies : ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
- Harish Thanniru
- Updated on- September 8, 2026 / 03:24 PM IST
AP government approves filling of 913 ASHA worker posts
AP Asha Workers Vacancies : ఏపీలోని మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 913 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరాలు వెల్లడించారు. 913 పోస్టుల్లో 673 గ్రామీణ, 64 గిరిజన, 176 పట్టణ ప్రాంతాల్లో భర్తీ చేయనున్నట్లు చెప్పారు.
జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ద్వారా (AP Asha Workers) ఈ నియామకాలు చేపట్టనున్నారు. పోస్టులకు దరఖాస్తు చేసుకొనే మహిళలు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక మహిళలకు ప్రాధాన్యం ఇవ్వంటం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకొనేవారి వయస్సు 25 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. ఒక్కో ఆశా కార్యకర్తకు నెలకు రూ.10వేల వేతనాన్ని ప్రభుత్వం అందించనుంది. నిబంధనలకు అనుగుణంగా ఈనెల 30వ తేదీ నాటికి నియామకాల జాబితాను పంపించాలని జిల్లా యంత్రాంగాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.
జిల్లాల వారీగా పోస్టుల వివరాలు ఇలా..
| జిల్లా | పోస్ట్‌లు |
| కర్నూలు | 65 |
| ప్రకాశం | 38 |
| వైఎస్సార్ కడప | 38 |
| అన్నమయ్య | 41 |
| చిత్తూరు | 32 |
| శ్రీ సత్యసాయి | 22 |
| నంద్యాల | 21 |
| తిరుపతి | 21 |
| తూర్పుగోదావరి | 44 |
| పశ్చిమగోదావరి | 42 |
| అల్లూరి సీతారామరాజు | 43 |
| పార్వతీపురం మన్యం | 43 |
| అనకాపల్లి | 77 |
| బీఆర్ అంబేడ్కర్ కోనసీమ | 32 |
| పోలవరం | 21 |
| కృష్ణా | 37 |
| గుంటూరు | 21 |
| ఎన్టీఆర్ | 15 |
| బాపట్ల | 7 |
| విశాఖపట్నం | 33 |
| పల్నాడు | 31 |
| విజయనగరం | 31 |
| కాకినాడ | 29 |
| శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు | 29 |
| ఏలూరు | 27 |
| అనంతపురం | 26 |
| మార్కాపురం | 25 |
| శ్రీకాకుళం | 22 |
